fbpx
Home Cinema 'సాహో'కి 'అజ్ఞాతవాసి'తో ఆ విషయంలో పోలిక!

‘సాహో’కి ‘అజ్ఞాతవాసి’తో ఆ విషయంలో పోలిక!

పవన్ డిజాస్టర్ సినిమాతో సాహోకు పోలిక

పవన్ కళ్యాణ్ కెరీర్ లో పెద్ద డిజాస్టర్ చిత్రం ‘అజ్ఞాతవాసి’. ఆ చిత్రాన్ని సోషల్ మీడియా జనం ఈ రోజు సాహో రిలీజ్ నేపధ్యంలో గుర్తు చేసుకుంటున్నారు. అందుకు కారణం ..రెండు సినిమాలు స్టోరీ లైన్ ….కొంచెం అటూ ఇటూగా ఒకేలా ఉండటం అని తెలుస్తోంది. ఫ్రెంచ్ చిత్రం లార్గోవించ్ ఆధారంగా ‘అజ్ఞాతవాసి’ వచ్చిందని అప్పట్లో వివాదం జరిగిందనే విషయం గుర్తుండే ఉండి ఉంటుంది. ఇప్పుడీ సాహో చిత్రం మూల కథ సైతం లార్గో వించ్ నే గుర్తు చేస్తోందంటున్నారు.

దానికి తోడు ఎంతో హైప్ తో వచ్చిన ఈ చిత్రం ఫ్లాఫ్ టాక్ తెచ్చుకుంది. దాంతో మరో ‘అజ్ఞాతవాసి’ అని తేల్చేస్తున్నారు. మౌత్ టాక్ సైతం నెగిటివ్ గా ఉండటంతో పాటు రివ్యూలు సైతం బాగోలేదనే అన్నాయి. బాలీవుడ్ అయితే ఈ సినిమాని చీల్చి చెండేడేస్తోంది. ప్రభాస్ ఇలాంటి సినిమా చేయటమేంటని అంటోంది. బాహుబలి క్రేజ్ ని క్యాష్ చేసుకోవటానికి చేసిన సినిమాలా ఉంది కానీ నిజాయితీగా చేసిన సినిమాలా లేదని అంటోంది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రభాస్, శ్రద్దా కపూర్ జంటగా నటించిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాని యువ దర్శకుడు సుజిత్ తెరకెక్కించాడు.అన్ని భాషల నుంచి ఈ చిత్రంలో ప్రధాన నటులు నటించడంతో హిందీలో కూడా అంచనాలు పెరిగాయి. వాటిని అందుకోవటంలో ఘోరంగా ఫెయిలైంది సాహో.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ