fbpx
Home Politics మళ్ళీ పవన్ జనాల్లోకి వస్తున్నారు

మళ్ళీ పవన్ జనాల్లోకి వస్తున్నారు

చాలా కాలం తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాన్ జనాల్లోకి అడుగుపెడుతున్నారు. అంటే ఎన్నికల్లో 140 సీట్లలో పోటి చేసిన జనసేనను జనాలు దాదాపుగా తిరస్కరించారు. రెండు చోట్ల పోటి చేసిన పవన్ ఏకంగా రెండు చోట్లా ఓడిపోయారు. అంతలా జనాలు తిరస్కరించారు.

ఎన్నికల ఫలితాల  తర్వాత పవన్ జనాల్లోకి అడుగుపెట్టింది లేదు. నేతలు లేకపోతే పార్టీ కార్యకర్తలు, అభిమానులు పార్టీ కార్యాలయానికో లేకపోతే ఇంటికో వస్తే మాత్రమే పవన్ కలిసేవారు. అలాంటిది ఈనెల 30వ తేదీన రాజధాని గ్రామాల్లో పర్యటించటానికి పవన్ రెడీ అయ్యారు.

రాజధాని అమరావతిని మార్చేస్తారని జరుగుతున్న ప్రచారంతో రాజకీయాలు అట్టుడికిపోతున్న విషయం తెలిసిందే. ప్రధానంగా టిడిపి నేతల రైతులను ఎగేసి పెద్ద రచ్చనే రాజేస్తున్నారు. ప్రత్యేకంగా టైం టేబుల్ వేసి మరీ పచ్చ  బ్యాచులను అన్నీ పార్టీల దగ్గరకు తిప్పుతున్నట్లు ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపధ్యంలోనే కొందరు రైతులు పవన్ ను ఆయన నివాసంలో కలిశారు.

ఆ తర్వాతే పవన్ రాజధాని గ్రామాల్లో పర్యటించాలని నిర్ణయించారు. రైతులే అడిగారో లేకపోతే తెరవెనకాల ఏదైనా ప్లాన్ జరిగిందో తెలీదు కానీ హఠాత్తుగా రాజధాని గ్రామాల్లో తిరగాలన్న నిర్ణయాన్ని పవన్ ప్రకటించారు. నిజానికి ఇప్పటికిప్పుడు గ్రామాల్లో తిరగాల్సిన అవసరమైతే లేదు. అయినా పవన్ పర్యటన పెట్టుకున్నారంటే…..

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ