fbpx
Home Politics ప్రమాదానికి  డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా ?

ప్రమాదానికి  డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా ?

ప్రమాదం జరిగిన తర్వాత కొందరు ప్రత్యక్షసాక్ష్యులు చెబుతున్నదాని ప్రకారం అందరికీ అదే అనుమానం వస్తోంది.  తూర్పు గోదావరి జిల్లాలోని పాపికొండలు చూడటానికి విహారయాత్రకు బయలుదేరిన ఓ లాంచి ప్రమాదానికి గురైన విషయం అందరికీ తెలిసిందే. ఆ లాంచిలో ప్రయాణిస్తున్న సుమారు 71 మందిలో దాదాపు 40 మంది ఆచూకి ఇంకా తెలియలేదు.

ఇప్పటికి 12 మంది మరణించినట్లు లెక్క తేలింది. 27 మంది సురక్షితంగా ప్రమాదంలో నుండి బయటపడ్డారు.  దేవిపట్నం వైపు నుండి ఆదివారం మధ్యాహ్నం బయలుదేరిన లాంచి కచ్చలూరు మందం ప్రాంతానికి చేరుకున్నదట. మామూలుగా డ్రైవర్లు ఎవరూ అటువైపుగా లాంచిలను నడపరట. ఎందుకంటే అక్కడ ప్రవాహ ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుంది. అందులోను ఇపుడు గోదావరిలో ప్రవాహ వేగం చాలా ఎక్కువగా ఉందన్న విషయండ్రైవర్ కు బాగా తెలుసు.

అందుకనే డ్రైవర్లందరూ  కచ్చలూరులోని కొండవాలు వైపు కాకుండా పశ్చిమగోదారి జిల్లా వైపుగా తీసుకెళతారు. కానీ ఈ లాంచి డ్రైవర్ మాత్రం కచ్చలూరు వైపే తీసుకెళ్ళారు. అందులోను ఆ సమయంలో చాలామంది లాంచి మొదటి అంతస్తులో భోజనం చేస్తున్నారు. భోజనం కారణంగా వేసుకున్న లైఫ్ జాకెట్లను తీసేశారు. వెళుతున్న లాంచి ఒక్కసారిగా కుదుపుకు గురైంది. దాంతో కుర్చీల్లో కూర్చుని భోజనం చేస్తున్న వారిలో కొంతమంది కుర్చీలతో సహా నదిలో పడిపోయారు.

అయితే డ్రైవర్ వెంటనే లాంచిని ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నంలో ఇంజన్ ను ఒక్కసారిగా రైజ్ చేయటంతో ఆగినట్లే ఆగిన లాంచి కాస్త ఒక్కసారిగా ముందుకు దూకింది. దాంతో రెండోసారి కూడా పెద్ద కుదుపు రావటంతో లాంచి ముదుకు వెనక్కు ఊగిపోయింది. దాంతో పట్టు తప్పిన పర్యాటకుల్లో చాలామంది నదిలోకి పడిపోయారు. ఇంతలో లాంచి కూడా ముణిగిపోయింది. జరిగిన విషయం బయటపడిన తర్వాత ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా తెలుస్తోంది.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ