fbpx
Home Politics చంద్రబాబు..గురివింద నీతి

చంద్రబాబు..గురివింద నీతి

చంద్రబాబునాయుడు చెబుతున్న నీతులు, మాట్లాడుతున్న విలువలన్ని గురివింద గింజ నీతినే గుర్తుకు తెస్తోంది.  గ్రామ సచివాలయ పోస్టుల పరీక్షల ప్రశ్న పత్రం లీకైందంటూ టిడిపి గోల చేస్తోంది. అందుకు బాధ్యత వహిస్తు జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే మంత్రులతో కానీ రాజీనామా చేయించాలని చంద్రబాబు, చినబాబులు ఒకటే ఊదరగొడుతున్నారు.

ప్రశ్నపత్రం లీకైందంటూ ఎల్లోమీడియా పెద్ద కథనాన్ని ఇచ్చింది.  అది నిజమే అయితే దానిపై ప్రభుత్వం విచారణ చేయిస్తుంది. బాధ్యులపై చర్యలు తీసుకుంటుందనటంలో సందేహం లేదు.  ఎల్లోమీడియా ప్రశ్నపత్రం లీకైందని  రాసేయటం,  వెంటనే జగన్ రాజీనామాకు చంద్రబాబు, చినబాబు డిమాండ్లు చేసేస్తుండటమే విచిత్రంగా ఉంది.

ప్రశ్నపత్రం లీకైనట్లు ప్రభుత్వం నిర్ధారించ లేదు. పరీక్ష నిర్వహణలో దాదాపు నాలుగైదు శాఖల బాధ్యత ఉంది. కథనం నిజమే అయితే ఎవరి బాధ్యత ఎంతో తేలాలి. తర్వాతే ఎవరిపైన చర్యలుంటాయనే విషయాన్ని  ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఇంతలోనే రాజీనామాలు డిమాండ్ చేసేస్తున్నారంటే ఎల్లోమీడియా+చంద్రబాబులు కలిసే రాజకీయం చేస్తున్నారనే విషయం తెలిసిపోతోంది.

ప్రశ్నపత్రాల లీకేజీలకే పదవులకు రాజీనామాలు చేసేంత సున్నిత మనస్కులెవరూ లేరన్నది వాస్తవం. ఎందుకంటే చంద్రబాబు హయాంలో 10వ తరగతి పరీక్షలు, ఇంటర్మీడియట్ ప్రశ్నపత్రాలు లీకైన విషయం తెలిసిందే. ఆ లీకేజీలో స్వయంగా మాజీ మంత్రి నారాయణ విద్యా సంస్దలదే ప్రధాన పాత్రగా తేలింది.

మరి అప్పుడు చంద్రబాబు కానీ మంత్రి నారాయణ కానీ లేకపోతే విద్యాశాఖ మంత్రి కానీ రాజీనామా చేశారా ? అప్పట్లో రాజీనామాలు చేయని, చేయించని చంద్రబాబు ఇపుడు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేయటం గురివింద గింజ నీతినే తెలియజేస్తుంది.

 

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ