Home Cinema ఆఫర్స్ రావటం లేదని నటి ఆత్మహత్య

ఆఫర్స్ రావటం లేదని నటి ఆత్మహత్య

అవకాశాలు లేవని ఆ నటి ఆత్మహత్య

ఎన్నెన్నో ఆశలతో ఇండస్ట్రీకి వచ్చే నటులు, నటీమణలు వాటికి విఘాతం తగిలితే తట్టుకోలేరు. దానికి తోడు ఫ్యామిలీలతో గొడవపడి వచ్చినవారిలో ఆ ఇంసెక్యూరిటీ మరీ ఎక్కువగా ఉంటుంది. వెనక్కి వెళ్లలేరు..ముందుకురాలేని పరిస్దితి. దాంతో వారికి ఆత్మహత్యే శరణ్యం అనిపిస్తుంది.

తాజాగా సినిమాల్లో అవకాశాలు దక్కకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ వర్థమాన నటి తన ఇంటి టెర్రస్ మీది నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న వైనం సిని పరిశ్రమను ఉలిక్కిపడేలా చేసింది. ముంబైలోని ఒషివారా ప్రాంతంలో గతరాత్రి చోటుచేసుకుందీ ఘటన. మృతురాలిని ఇరవై ఏళ్ల పెర్ల్ పంజాబీగా గుర్తించారు. సినిమాల్లో నటించే ఆఫర్స్ కోసం చాలా కాలం ఎదురుచూసినప్పటికీ లక్ కలిసిరాకపోవడంతో… ఆమె తీవ్ర మనోవేదనకు గురైనట్టు పోలీసులు వెల్లడించారు.

చనిపోయిన నటి అపార్ట్‌మెంట్ వద్ద వాచ్‌మేన్‌గా పనిచేస్తున్న బిపిన్ కుమార్ మాట్లాడుతూ…‘‘రాత్రి 12:15 నుంచి 12:30 మధ్య ఈ సంఘటన జరిగింది. కేకలు వినబడుతుంటే ఎవరో రోడ్డుమీద అరుస్తున్నారని అనుకున్నాను. కానీ ఆమె ఉంటున్న మూడో అంతస్తు నుంచి అరుపులు వినిపించాయి…’’ అని పేర్కొన్నారు.

కాగా మానసికంగా కలతచెందిన పంజాబీ తరచూ తన తల్లితో గొడవపడేదని ప్రాధమిక విచారణలో తేలింది. ఇంతకు ముందు కూడా రెండు సార్లు ఆత్మహత్యకు ప్రయత్నించిందనీ.. అయితే తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుందని పోలీసులు పేర్కొన్నారు.

Bikini Show

Recent Galleries

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ