Home News Andhra Pradesh సీఎంలిద్ద‌రు నంద‌మూరి అభిమానులే: బాల‌య్య‌!

సీఎంలిద్ద‌రు నంద‌మూరి అభిమానులే: బాల‌య్య‌!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు వియ్యంకుడిగా నంద‌మూరి బాల‌కృష్ణ అంటే కొంద‌రికి గిట్ట‌ని మాట వాస్త‌వం. రాజ‌కీయాల ప‌రంగా బాల‌య్య‌ను ప్ర‌త్య‌ర్ధి పార్టీలు విమ‌ర్శిస్తాయి. అందులో భాగంగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అయినా విమ‌ర్శించొచ్చు ..ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అయినా విమ‌ర్శించొచ్చు.ఇది కేవ‌లం రాజ‌కీయం కోణం మాత్రమే. రాజ‌కీయంగా విమ‌ర్శ‌లు, స‌వాళ్లు విసురుకోవ‌డం, హ‌ద్దు మీరి దుర్భాష‌లాడుకోవ‌డం, వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌కు వెళ్ల‌డం అన్న‌ది చాలా స‌హ‌జంగా జ‌రిగేది. కానీ బాల‌య్య చంద్ర‌బాబుకు వియ్యంకుడు కాక‌ముందు పెద్ద స్టార్. స్వ‌ర్గీయ ఎన్టీరామారావు త‌న‌యుడు.

ఓ స్టార్ గా బాల‌య్య‌ను అభిమానించే వాళ్లు, ఆరాధించే వాళ్లు కోట్ల‌లో ఉన్నారు. రాజ‌కీయంగా విమ‌ర్శించిన వాళ్లే బాల‌య్య‌ను స్టార్ గా ఇష్ట‌ప‌డే వాళ్లు ఉన్నారు. ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బాల‌య్యుకు వీరాభిమాని అని సోష‌ల్ మీడియాలో చాలాసార్లు వైర‌ల్ అయింది. అప్ప‌ట్లో బాల‌య్య న‌టించిన రాయ‌ల‌సీమ ఫ్యాక్ష‌న్ సినిమాలు చూసి జ‌గ‌న్ పెద్ద ఫ్యాన్ అయ్యార‌ని అంటారు. ఇక తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎన్టీఆర్ కు ఎంత పెద్ద అభిమానో చెప్పాల్సిన ప‌నిలేదు. ఎన్టీఆర్ పేరునే కేసీఆర్ త‌న కుమారుడుకి కేటీఆర్ అని పెట్టుకున్నారంటే? ఎన్టీఆర్ అంటే ఎంత అభిమాన‌మో తేట‌తెల్ల‌మ‌వుతోంది.

అయితే తాజాగా ఓ ఇంట‌ర్వూలో బాల‌య్య ఇద్ద‌రు సీఎంలా నంద‌మూరి అభిమానులేన‌ని వ్యాఖ్యానించారు. కేసీఆర్ గారు నాన్న‌కు అభిమాని అయితే…జ‌గ‌న్ నాకంటూ చెప్ప‌క‌నే చెప్పారు. అంత‌కు ముందు యాంక‌ర్ జ‌గ‌న్ మీ అభిమాని అని తెలుసా? అని అడిగారు .దానికి బాల‌య్య క‌డ‌ప అభిమాన సంఘం ప్రెసిడెంట్ జ‌గ‌న్ అంటూ చెప్ప‌క‌నే చెప్పారు. కాంగ్రెస్ లో ఉన్న చాలా మంది నాయ‌కులు నాన్న‌గారి అభిమానులేన‌ని గుర్తు చేసారు. అయితే ఇక్క‌డ రాజకీయాలు వేరు. సినిమాలు వేరు అన్న విష‌యాన్ని గుర్తుంచుకోవాల‌న్నారు. అయితే ఈ వ్యాఖ్య‌లు బాల‌య్య‌పై వివాదం రేగిన నేప‌థ్యంలో చేయ‌డంతో ఆస‌క్తి సంత‌రించుకుంది.

Telugu Latest

హీరోకి జ్ఞానోదయం..  బడ్జెట్ కూడా తగ్గింది !    

ఓటమి వల్ల చాల కోల్పోతాం గాని,  నిజానికి ఆ ఓటమే  మనకు చాల నేర్పిస్తోంది అంటున్నాడు  యాక్షన్ హీరో గోపీచంద్‌. అంతేలే వరుస డిజాస్టర్లు వచ్చినప్పుడు ఆ ప్లాప్ ల నుండే  చాల నేర్చుకోవచ్చు.  ఏది ఏమైనా  గోపీచంద్‌ లో...

రామయ్యకు ఆలయం.. ఊరు వాడ సంబరం 

అయోధ్య.. ఈ పేరు ఎత్తితే మత ఘర్షణలు, అల్లర్లు, రాజకీయ ఎత్తుగడలు, కోర్టు కేసులు, రెండు మతాల మధ్య గొడవలే గుర్తొచ్చేవి ఇన్నాళ్ళు.  కానీ ఆ అల్లకల్లోలాల మాటున మహోన్నత చరిత్ర ఉంది. ...

మెగాస్టార్ ని మార్చేసిన ఒకే ఒక్క వేదిక ఏదంటే?

చిరంజీవిని మెగాస్టార్ గా చేసింది అభిమానులు. అదే అభిమానులు ఆయ‌న్ని రాజ‌కీయ‌నాయ‌కుడ్ని చేసారు. కానీ సినిమాల్లో స‌క్సెస్ అయిన‌ట్లుగా రాజ‌కీయాల్లో సక్సెస్ కాలేదు. అభిమానించిన కోట్లాది మంది అభిమానులు రాజ‌కీయంగా ఆయ‌న వెనుక...

#క‌రోనా: SPB.. పాప్ స్మిత.. 30YR పృథ్వీల‌కు పాజిటివ్

హైద‌రాబాద్ లో క‌రోనా విల‌య‌తాండ‌వ‌మాడుతోంది. టీవీ సీరియ‌ల్ ఆర్టిస్టులు.. యాంక‌ర్లు స‌హా వ‌రుస‌గా సినీ సెల‌బ్రిటీల‌కు క‌రోనా మ‌హ‌మ్మారీ సోకింద‌న్న వార్త‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఎవ‌రూ ఇండ్ల నుంచి బ‌య‌ట‌కు రాక‌పోయినా ఏదో...

టాప్ స్టోరి: క‌రోనా మెడిసిన్‌లో మాఫియా పైశాచిక‌త్వం

దోపిడీకి ఒక్కొక్క‌రిదీ ఒక్కో మార్గం. కొంద‌రు ప్ర‌జ‌ల్ని భ‌య‌పెట్టి బెంబేలెత్తించి కూడా దోపిడీకి పూనుకుంటారు.  పెట్టుబ‌డి దారీ వ‌ర్గం కోర‌లు చాచిన చోట ఈ దందా త‌ప్ప‌దు. ఈ కోవ‌కే చెందుతుంది మెడిక‌ల్...

English Latest

Parasuram teases fans with SVP update

Mahesh Babu is all set to celebrate his birthday on the 9th of August. To surprise the fans, a small song from SVP will...

Mega plans for NTR-Mahesh multi starrer

Mega producer Allu Aravind is known as a master strategist and he plans interesting and commercial films to maintain his success run at the...

Breaking: Chandra Babu to resign in couple of minutes today

Everyone knows that former AP CM ,TDP chief Chandra Babu Naidu has been seething with anger ever since AP governor gave his consent for...

Did Pawan set a trap for Jagan and CBN

Right after the Governor’s green signal for the formation of three capital, politics in Andhra Pradesh started heating up. Former CM, TDP chief Chandra...

Will Natural Star create a sequel sensation

Natural Star Nani is popular for his exceptional realistic and natural performance. He is currently starring in a crime thriller V along with Sudheer...

Actor/Actress/Celebrity