Home TR Exclusive ఇబ్బంది అనిపిస్తే చంద్రబాబు చరిత్రను చక్కగా మరచిపోతారు...

ఇబ్బంది అనిపిస్తే చంద్రబాబు చరిత్రను చక్కగా మరచిపోతారు…

(వి.శంకరయ్య)

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వభావం కాస్తా కూస్తో ఎరిగిన వారు గత మూడేళ్లుగా ఆయన ప్రసంగాలు వింటుంటే విస్తు పోవలసి వస్తోంది. 2014 లో అధికారం చేపట్టి ఏడాది గడవకు ముందే తనేంచేశాడో ఆయన చాలా సలభంగా మర్చిపోయి మాట్లాడుతుంటారు. ఈ మధ్య ఈ మతిమరపు ఆయనకు బాగా ఎక్కువయింది.తను చేసిన తప్పుల్ని అసలుగుర్తుపెట్టుకోరు. మొన్న శనివారం కోలకతాలో జాతీయ స్థాయిలో జరిగి సభలో కూడా కర్నాటకలో బిజెపి పార్టీ ఫిరాయింపులకు పాల్పడు తున్నదని ప్రసంగం చేస్తున్నపుడు ఆయన తన గతం మర్చిపోయారు. ఇది తన వ్యక్తిత్వాని తనే దిగ జార్చుకొనే విధంగా వుంది.

ఈ ప్రసంగం కొందరు వారు ముఖ్యమంత్రి కి ప్రత్యర్థులు కావచ్చు – సోషల్ మీడియాలో చొప్పించగా హల్ చల్ చేస్తోంది. అయితే వారు ఏ ఉద్దేశంతో సోషల్ మీడియాలో పెట్టినా ముఖ్యమంత్రి తనకు నెగిటివ్ గావుండే అంశాలు ప్రసంగాలలో రాకుండా చూచు కోవలసి వుంది. ముఖ్యమంత్రి చుట్టూ పలువురు మేధావులు పార్టీ సీనియర్ నేతలు వుంటారు. వారైనా కనీసం ఆయనకు సలహా ఎందుకు ఇవ్వడం లేదో తెలియదు?

2014 ఎన్నికల తర్వాత తొలుత కెసిఆర్ పార్టీ ఫిరాయింపులకు తెర దీశారు. తదుపరి జరిగిన హైదరాబాద్ జంట నగరాల కార్పొరేషన్ ఎన్నికల్లో టిడిపి తరపున ప్రచారం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు కెసిఆర్ ను దునుమాడుతూ పార్టీ ఫిరాయింపులను రాజకీయ వ్యభిచారంగా అభివర్ణించారు. అందరూ చప్పట్లు కొట్టారు. రాజకీయ వర్గాలు విశ్లేషకులు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజాస్వామ్యం యెడల గల నిబద్ధతను మెచ్చు కొన్నారు.

కెసిఆర్ కు ప్రభుత్వం నడిపే మెజారిటీ వున్నా అభద్రతా భావంతో ఈ చర్యకు తలపడి నట్లు భావించారు. కాని ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా తగినంత మెజారిటీ వున్నా కొద్ది నెలల్లోనే పార్టీ ఫిరాయింపులకు తెర తీయడంతో మొత్తంగా పరువు పోయింది. రాజకీయాలో నిబద్ధత విశ్వసనీయత వుండాలని ఉపన్యాసాలు ఇచ్చే చంద్రబాబు ఈ చర్యతో సగటు రాజకీయ నేతగా మిగిలిపోయారు. ఈ అంశాలు ఎవరైనా ప్రస్తావించితే వారంతా వైసిపి వారుగా ముద్ర వేసి ఎదురు దాడితో టిడిపి నేతలు సరి పెడుతున్నారు. గాని ప్రజల దృష్టిలో చులకన కావడం వీరికీ పట్టడం లేదు. రాజకీయ నేతలకు మతి మరుపు వుంటుంది. కాని ప్రజలు మాత్రం ఎప్పుడూ మెలుకువగానే వుంటారు. ఇది గత చరిత్ర.
ఇదే కాదు. ఈ లాంటి సంఘటనలు చాలా సంభవించాయి. మచ్చుకు టిఆర్ఎస్ తో పొత్తు. టిఆర్ఎస్ తో పొత్తుకు తను ప్రతి పాదన చేసి నట్లు వారు నిరాకరించారని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు. ఆ తర్వాత కాంగ్రెస్ తో పొత్తు పెట్టు కొన్నారు. పార్టీ రాజకీయ అవసరాలతో కాంగ్రెస్ తో పొత్తు దాని ఫలితాలు టిడిపి భరిస్తుందని భావించినా అదే పార్టీతో వైసిపి పొత్తు పెట్టుకొంటే ఏలా అపవిత్రం అవుతుంది? . ఎప్పుడో కెసిఆర్ ఆంధ్ర బిరియాని ఆవు పేడగా వుంటుందని లంకలో పుట్టిన వారంతా రాక్షసులు అయినట్టు ఎపి వారంతా దుర్మార్గులని చెప్పారని దాన్ని పేర్కొంటూ ముఖ్యమంత్రి తనయుడు మంత్రి లోకేష్ వ్యాఖ్యానించడం ఎంత వరకు సబబు?

అంటే కెసిఆర్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే రాజకీయ వ్యభిచారం-అదే చంద్రబాబు చేస్తే అభివృద్ధి చూచి ప్రతి పక్ష ఎమ్మెల్యేలు పార్టీ మారారా? చంద్రబాబు టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే తప్పు లేదు. గాని మరో పార్టీ జట్టు కడితే అది తప్పా? చంద్రబాబు పొత్తుకు యత్నం చేసినపుడు ఆంధ్ర బిరియాని ఆవు పేడగా కెసిఆర్ అభివర్ణించిన అంశం మంత్రి లోకేష్ కు గుర్తుకు రాలేదా?ప్రజలు వాచ్ డాగ్ లాగా వుంటారనే స్ప్రుహ లేక పోతే ఇలాంటి ప్రసంగాలే నేతలు చేస్తుంటారు.

ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి గాని ఆయన తనయుడు తప్పు మీద తప్పులు మాట్లాడు తున్నారు. మంత్రి లోకేష్ కు శిక్షణ ఇవ్వబడిందని ఆ మధ్య ప్రచారంలో వుండింది. ఆలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా శిక్షణ తీసుకుంటే మంచి దేమో. గతంలో టిడిపి నేతలు ఎవరైనా భిన్నంగా మాట్లాడితే ముఖ్యమంత్రి చంద్రబాబు పిలిచి క్లాస్ తీసుకొనే వారు. ఇప్పుడు పార్టీ అధినేత తాను చేసిన పనులను తన సౌలభ్యం కోసం మర్చిపోవడం వింతగా ఉంది.

సాధారణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు యే కాదు. ఎవరైనా సరే తమ పార్టీ ప్రయోజనం లేదా మరొక ఏదైనా కారణంతో కొన్ని తప్పులకు పాల్పడటం ఈ వ్యవస్థలో తప్పని సరి. ఆలాంటి సమయంలో ఆ అంశాన్ని తిరిగి తెర మీదకు రాకుండా జాగ్రత్త పడుతుంటారు. రాష్ట్ర విభజన అనంతరం కెసిఆర్ పార్టీ ఫిరాయింపులు ప్రారంభించితే ఆయనను తలదన్ను విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కథ నడిపి ప్రజా స్వామ్యానిని నడి వీధిలో ఖూనీ చేసి చరిత్ర కెక్కారు.ఇటీవల కాలంలో ఎపిలో జరిగిన విధంగా ఫిరాయింపులు మరే రాష్ట్రంలో సంభవించ లేదు.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కోలకతా సభలో మాట్లాడుతూ కర్నాటకలో ఎమ్మెల్యేలను పశువులుగా కొన డానికి బిజెపి కోట్ల రూపాయలను వెచ్చించు తున్న దని పేర్కొన్నారు. మరి ఎపిలో పార్టీ ఫిరాయించిన వారు పశువులేనా?ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్ని కోట్లు వ్యయం చేశారు.? ఇవన్నీ ప్రతి సామాన్య వ్యక్తికి వచ్చే సందేహాలే.

రాష్ట్రంలో ఈ అంశంపై భంగ పాటు చెంది వచ్చిన వ్యతిరేకత నుండి బయట పండేందుకు ప్రతి మహిళకు సెల్‌ఫోన్లు ఇన్నాళ్లు లేని విధంగా పదివేల రూపాయలు ఇవ్వాల్సిన దుస్థితి టిడిపి ప్రభుత్వంకు ఏర్పడింది. తాజాగా ఈ ప్రసంగంతో జాతీయ స్థాయిలో కూడా మరో మారు చులకన కావడం జరిగింది.

 

 

 

 

వి. శంకరయ్య సీనియర్ జర్నిలిస్టు, రాజకీయ వ్యాఖ్యాత

Recent Post

స‌క్సెస్ కోసం అందాల రాక్ష‌సి శ్ర‌మిస్తోంది!

`అందాల రాక్ష‌సి` సినిమాతో పేరు తెచ్చుకున్నా లావ‌ణ్య త్రిపాఠికి రావాల్సిన క్రేజ్ ఇంకా ద‌క్క‌లేద‌నే చెప్పాలి. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, సోగ్గాడే చిన్నినాయ‌నా. శ్రీ‌న‌స్తు శుభ‌మ‌స్తు, అర్జున్ సుర‌వ‌రం వంటి చిత్రాల్లో న‌టించినా...

మెగా హీరో కోసం రంగంలోకి దిల్‌రాజు – యువీ!

`చిత్ర‌ల‌హ‌రి` సినిమాతో మ‌ళ్లీ ట్రాక్‌లోకి వ‌చ్చాడు మెగా మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్‌తేజ్‌. ఇటీవ‌ల `ప్ర‌తీరోజు పండ‌గే` చిత్రంతో మ‌రో హిట్‌ని త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఈ రెండు చిత్రాలు అందించిన స‌క్సెస్ ఆనందంలో వున్న...

రానా కోసం నందిత వ‌చ్చేసింది!

`నీది నాది ఒకే క‌థ‌` ఫేమ్ వేణు ఊడుగుల తెర‌కెక్కిస్తున్న చిత్రం `విరాట‌ప‌ర్వం`. రానా, సాయి ప‌ల్ల‌వి హీరో హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు. ఉత్త‌ర తెలంగాణ‌లో పీపుల్స్ వార్ ఉద్య‌మానికి సంబంధించిన కీల‌క సంఘ‌ట‌న‌లు...

టాప్ లెస్‌గా పోజులిచ్చిన కియారా!

నెట్‌ఫ్లిక్స్ కోసం అనురాగ్ క‌శ్య‌ప్ రూపొందించిన వెబ్ సిరీస్ `ల‌స్ట్ స్టోరీస్‌`. ఇందులో ఓ భాగాన్ని క‌ర‌ణ్ జోహార్ రూపొందించాడు. మేఘాగా న‌టించిన కియారా అద్వానీ న న‌ట‌న‌తో దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం...

జ‌క్క‌న్నకు భారీ షాక్.. ఈ సారి మ‌రో లీక్‌!

రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న `ఆర్‌ ఆర్ ఆర్‌` రిలీజ్‌కు ముందే సోస‌ల్ మీడియ‌లో వైర‌ల్‌గా మారుతోంది. సినిమా మొద‌లైన ద‌గ్గ‌రి నుంచి ఈ చిత్రానికి సంబంధించి ఏదో ఒక‌టి లీక్ అవుతూనే వుంది. క్యారెక్ట‌ర్స్...

రూ 150 కోట్లు … అందుకే సిబిఐ వద్దన్నారా?

 "ఆంధ్ర ప్రదేశ్ లో ఒక ప్రముఖ వ్యక్తికి రూ 150 కోట్లు చెల్లించిన ఆధారాలు లభించాయి." "మూడు ప్రధాన కాంట్రాక్టు కంపెనీలు హవాలా ఏజెంట్లు, బ్రోకర్లతో నల్లధనాన్ని విదేశీ పెట్టుబడుల రూపంలో తెచ్చిన...

అమ్మ‌కానికి రామానాయుడు స్టూడియో?

అమ్మ‌కానికి రామానాయుడు స్టూడియో సిద్ధ‌మ‌వుతోంది. గ‌త కొన్ని ద‌శాబ్దాల పాటు రామానాయుడు హ‌యంలో ఓ వెలుగు వెలిగిన స్టూడియో ఇది. ఇక్క‌డ చిన్న సినిమాల నుంచి స్టార్స్ చిత్రాల వ‌ర‌కు ఓపెనింగ్‌లు జ‌రుపుకున్నాయి....

ఫ‌స్ట్‌నైట్ ప్లేస్ అంటూ శ్రీ‌రెడ్డి షాకింగ్ పోస్ట్!

శ్రీ‌రెడ్డి.. కాస్టింగ్ కౌచ్ వివాదంతో వెలుగులోకి వ‌చ్చిన పేరిది. త‌న‌కు `మా`లో స‌భ్య‌త్వం ఇవ్వ‌లేద‌ని వ‌ర్మ ఇచ్చిన ప్లాన్ ప్ర‌కారం ఇండస్ట్రీలో ర‌చ్చ‌కు తెర‌లేపి సెల‌బ్రిటీ అయిపోయింది. ప‌నిలో ప‌నిగా ముందు అనుకున్న...

CAA NPR NRC ముఖ్యమంత్రి మెడ మీద కత్తిలా వున్నాయా?

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం CAA (పౌర సత్వ సవరణచట్టాన్ని) తీవ్ర అభ్యంతరాల మధ్య చట్ట సభల్లో ఆమోదించింది. ఏదో విధంగా కాశ్మీర్ లో ఆర్టికల్ 370 ని నిర్వీర్యం చేసింది. సిఎఎని ఆధారం...

కేంద్రం హామీతో జోష్ లో ముఖ్యమంత్రి

వికేంద్రీకరణ సిఆర్డీఏ రద్దు బిల్లులకు శాసన మండలిలో బ్రేక్ పడటంతో ముఖ్యమంత్రి తానూహించినట్లు ముందుకు పోయే వీలు లేకుండా పోయింది. ఈ దశలో కేంద్రం సాయం లేనిదే బయట పడటం కుదరదని భావించే ముఖ్యమంత్రి...

Featured Posts

రూ 150 కోట్లు … అందుకే సిబిఐ వద్దన్నారా?

 "ఆంధ్ర ప్రదేశ్ లో ఒక ప్రముఖ వ్యక్తికి రూ 150 కోట్లు చెల్లించిన ఆధారాలు లభించాయి." "మూడు ప్రధాన కాంట్రాక్టు కంపెనీలు హవాలా ఏజెంట్లు, బ్రోకర్లతో నల్లధనాన్ని విదేశీ పెట్టుబడుల రూపంలో తెచ్చిన...

అదే విషం..అదే పైత్యం..అదే ఆక్రోశం

ఎప్పటిలాగే భేతాళుడు విక్రమార్కుడి భుజం పైకి ఎక్కినట్లు ఎప్పటిలాగే రాధాకృష్ణ ఈవారం కూడా తన ఆక్రోశాన్ని కక్కేసాడు.  కాకపొతే ఈసారి కొంచెం నిర్వేదం, కొంత అయోమయం, కొంత ఖేదం పొగలు కక్కాయి.  చంద్రబాబు...

వైసిపి- బిజెపి పొత్తు! ఒక్క రోజులోనే పలు యూ టర్న్ లు!

మంత్రి బొత్స సత్యనారాయణ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా చేరిన తర్వాత బహు బోల్డ్ గా తయారై ముఖ్యమంత్రికి ముందే ప్రభుత్వ విధానాలే కాకుండా పార్టీ పాలసీ...

ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన సఫలమా? విఫలమా?

రెండు రోజుల క్రితం ఒక సారి తిరిగి శుక్ర శనివారాలు రెండు రోజులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో మకాం బెట్టి ప్రధాన మంత్రిని హోం మంత్రిని న్యాయ శాఖ మంత్రిని కలసి...

జగన్ అమిత్ షా చర్చల ఎజెండా ఏమిటి?

దీర్ఘ విరామం తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిశారు. వాస్తవంలో ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. ముఖ్యమంత్రులు ప్రధాన మంత్రిని తరచూ కలుసుకొంటూ వుంటారు. కాని ముఖ్యమంత్రి ప్రధానిని...