Home TR Exclusive 'జై హింద్' నినాదం అందించింది హైదరాబాద్ విద్యార్థే...

‘జై హింద్’ నినాదం అందించింది హైదరాబాద్ విద్యార్థే…

భారత దేశంలో కోట్లాది మంది ప్రజలు రోజూ ఏదో ఒక సందర్బంలో జైహింద్ అనాల్సిందే. ప్రభుత్వ కార్యక్రమాలన్నీ జైహింద్ నినాదంతోనే ముగుస్తుంటాయి. ప్రధాని మోదీ వచ్చాక జైహింద్ మరీ ఎక్కువగా వినబడుతూ ఉంది. జైహింద్ అనే మాట భారతజాతీయ సంస్కతిలో విడదీయ రాని భాగమయింది. వందేమాతరం నిజానికి పాతబడిపోయినా, శాశ్వతంతా నిలబడింది జైహింద్ అనే మాటయే. భారత స్వాతంత్య్ర పోరాటకాలంనుంచి ఇలా కొనసాగుతున్న సంప్రదాయాలు చాలా తక్కువ. వైబ్రాంట్ గా కొనసాగుతున్నది  జైహింద్ అనే మాటయే. అయితే, ఇంత శక్తి వంతమయిన ఈ మూడక్షరాల మాటను భారతీయులకు అందించింది హైదరాబాద్ యువకుడని చాలామందికి తెలియదు. జై హింద్ గ్రీటింగ్ వాచకం వెనక చాలా కథ ఉంది.

నేతాజీ తో అబిద్ (ట్విట్టర్ @anujdhar నుంచి)

భారతీయులందరి నోళ్లలో నానే ఈ శక్తి వంతమయిన హిందూ నినాదాన్ని తయారుచేసింది హైదరాబాద్ కు చెందిన ముస్లిం కుర్రవాడు. ఆయన పేరు అబిద్ హసన్ ‘శాఫ్రాని’.  శాఫ్రని వెనకకూడా మరొక కథ ఉంది.

భారత స్వాతంత్ర్య సంగ్రామంలో భారతీయులే కాదు, ఎంతో మంది విదేశీయులు కూడా పాల్గొన్నారు. కొందరు నేరుగా పోరాటంలో పాల్గొంటే మరికొందరు తమకు నచ్చిన రూపాలలో బ్రిటిష్ వాళ్ల మీద వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఇలాంటి కుటుంబాలలో అబిద్ కుటుంబం ఒకటి. అబిద్ జర్మనీలో చదువుతున్న ఇంజనీరింగ్ కోర్సు మధ్యలో మానేసి నేతాజి సుభాష్ చంద్రబోస్ స్థాపించిన అజాద్ హింద్ ఫౌజ్ (ఇండియన్ నేషనల్ ఆర్మీ ఐఎన్ ఎ) లో చేరాడు. అజాద్ హింద్ ఫౌజ్ లో అన్ని మతాలవాళ్లు వుండేవాళ్లు. అందరికి ఒకటే కామన్ కిచెన్ ఉండేడి. అపుడు అందరిని సమానంగా పిలుచుకునేందుకు ఒక మాట అవసరమయింది. ఏదయినా ఒక హిందూ మాట కోసం అన్వేషణ మొదలయింది. అబిద్ రెండు మాటలు ఇచ్చారు. మొదట హెలో అని మాట సూచించారు. దానికి ఆయనను అంతా ఆటపట్టించారు. తర్వాత ఆయన జైహింద్ అనే మాట సూచించారు. సుభాస్ బోస్ కు అది బాగా నచ్చింది. అప్పటి నుంచి భారత జాతీయ విప్లవ నినాదం అయింది.

 అబిద్ జర్మనీ ఎందుకు వెళ్లాడు

ఇంజనీరింగ్, న్యాయ శాస్త్రం వంటి ఉన్నత విద్య కోసం భారతీయులంతా ఇంగ్లాండ్ వెళ్లేందుకు క్యూ కట్టిన ఆ రోజుల్లో అబిడ్ జర్మనీ వెళ్లాడు. దానివెనక ఆయన కుటుంబ జాతీయ భావాలున్నాయి. 

అబిద్ అసలు పేరు జాయిన్ ఉల్ అబిడీన్ హసన్. ఆయన అబిద్ హసన్ గా, అబిద్ హసన్ శాఫ్రనీగా పేరుపొందారు. నిజానికి ముస్లింలలో శాఫ్రనీ అనే ఇంటిపేరు లేదు. హిందూ దేశభక్తికి సంకేతంగా ఆయన శాఫ్రన్ (కాషాయం) ని తన సర్ నేం గా మార్చకుని అబిద్ శాఫ్రనీ అయ్యారు.

1853-1883 మధ్య హైదరాబాద్ దీవాన్ గా సర్ సాలార్ జంగ్ 1 హైదరాబాద్ సంస్థానం లో విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలనుకున్నారు. దీనికోసం ఆయన బ్రిటిష్ ఇండియా నుంచి ఎందరో ఇంగ్లీష్ చదువుకున్న నిపుణులను తీసుకువచ్చారు. ఇలా వచ్చిన వారిలో నవాబ్ మోషిన్ ఉల్ ముల్క్ ఒకరు. ఆయన సోదరుడు అమీర్ హసన్. ఆయన తర్వాత హైదరాబాద్ కలెక్టర్ అయ్యారు. ఆయన కుమారుడే అబిద్ హసన్. 1911లో ఆయన జన్మించారు. తల్లి ఇరానీ మహిళ. ఆమెకు బ్రిటిష్ వాళ్లంటే గిట్టేదికాదు. అందుకే తన పిల్లలను ఉన్నత చదువులకు ఇంగ్లాండు పంపడాన్ని ఆమె వ్యతిరేకించారు. జర్మనీకి పంపారు. ఇలా అబిద్ ఇంజనీరింగ్ చదువుకోసం జర్మనీ వెళ్లారు.

రెండో ప్రపంచ యుద్ధ కాలంలో సుభాస్ చంద్రబోస్ జర్మనీకి తప్పించుకుని పోయారు. అక్కడి నుంచి ఆయన బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా సాయుధ పోరాటానికి ఏర్పాట్లు మొదలుపెట్టారు. జర్మనీ బ్రిటిష్ తో తలపడుతూ ఉంది కాబట్టి, భారతీయుల్లో బ్రిటిష్ వ్యతిరేకత నూరిపోసేందుకు జర్మనీ బోస్ కు సహాయం చేస్తూ వచ్చింది.

  జైహింద్ ఇలా వచ్చింది

జర్మనీకి చిక్కిన భారతీయ యుద్ధ ఖైదీలను ఉద్దేశించి బోస్ ప్రసంగించే వారు. వారంతా బ్రిటిష్ కు వ్యతిరేకంగా ఆజాద్ హింద్ ఫౌజ్ లో చేరాలని పిలుపు నిచ్చేవారు. ఇలాంటి ఒక సందర్భంలో అబిద్ నేతాజీని కలుసుకున్నారు. తన చదువు అయిపోగానే తాను కూడా దేశం కోసం ఆజాద్ హింద్ ఫౌజ్ లో చేరాతానని చెప్పారు. నేతాజీ ఆపుడాయన మీద ఒక చురక వేశారు. అటువైపు దేశ విముక్తి అజాద్ హింద్ ఫౌజ్ లో చేరాలని పిలుపు నిస్తుంటే ఇలాంటి అల్పవిషయాలు ప్రతిబంధకాలు కారాదు అన్నారు. అంతే, ఆయన చదువు వదిలేసేందుకు సిద్ధమయ్యారు. జర్మన్ భాష వస్తుంది కాబట్టి ఆయన అక్కడిక్కడే నేతాజీ సెక్రెటరీగా, అనువాదకుడిగా నియమితుడుయ్యాడు. అప్పటి నుంచి అబిద్ నేతాజీ వెంటే ఉన్నారు.నేతాజీతో కలసి సింగపూర్ జపాన్ లలో పర్యటించారు. అజాద్ హింద్ ఫౌజ్ లో అబిద్ ‘మేజర్’ అయ్యారు.
అజాద్ హింద్ ఫౌజ్ లో ఒకరికొకరు అభినందనలు చెప్పుకునేందుకు ఒక భారతీయ విధానంలో ఒక మాట ఉండాలని అనుకున్నారు. అదే బ్రిటిషర్లనుంచి విముక్తి పొందాక కూడా దేశాన్ని నడిపించాలన్నది కోరిక. దీనికి చాలా మందిని సూచనలు కోరారు. అబిద్ మొదట ‘హెల్లో’ అన్నారు. అంతా తోసిపుచ్చారు. తర్వాత ఆయన ‘జై హింద్ ’అన్నారు. నేతాజీ కి నచ్చింది. ఆ మరుసటి క్షణం నుంచి భారత జాతీయ ఉద్యమాన్ని నడిపించిందదే మాట. ఇపుడడి భారత దేశా జాతీయ నినాదం.  నేతాజీ ఏర్పాటుచేసిన ప్రొవిజిన్ భారత ప్రభుత్వానికి జనగణమన జాతీయగీతాన్ని హిందీ,ఉర్దూలలో అనువదించి (Shubh, sukh chain ki barkha barse, bharat bhagya hai jaga) అందించింది కూడా అబిదే. ఈ గీతానికి రామ్ సింగ్ థాకూరీ సంగీతం సమకూర్చారు.

 శాఫ్రనీ ఇంటి పేరు 

నేతాజీ నాయకత్వంలోని అజాద్ హింద్ ఫౌజ్ లో అన్ని మతాల వాళ్లుండేవాళ్లు. వీళ్ల మధ్య అపుడపుడు గొడవలు కూడా జరగుతుండేవి. స్వాతంత్య్రం వచ్చాక భారతదేశపు జండా ఏ రంగులో ఉండాలనేది చర్చకు వచ్చినపుడు హిందూ ముస్లింల మధ్య అభిప్రాయబేధాలు తలెత్తాయి. హిందువులు కాషాయం కావాలన్నారు. ముస్లింలు ఆకుపచ్చ రంగు కావాలని పట్టుబట్టారు. ఈ గొడవ ముదిరే పరిస్థితి వచ్చింది. అపుడు హిందువులు కాషాయం మీద పట్టు సడలించుకున్నారు. ఈ చర్యతో అబిద్ చలించి పోయారు. అందుకే హిందూ మతానికి ప్రతీక అయిన కాషాయం (శాఫ్రాన్) రంగుని ఆయన ఇంటిపేరు గా మార్చకున్నారు. అబిద్ శాఫ్రనీ అయ్యారు. అజాద్ హింద్ ఫౌజ్ పతనమయ్యాక అబిద్ అరెస్టయి సింగపూర్ జైల్లో ఉన్నారు. కుటుంబ సభ్యులు ఆయన చనిపోయారనుకున్నారు. 1946లో ఐఎన్ ఎ కేసు విచారణల తర్వాత అబిద్ విడుదలయి హైదరాబాద్ వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో ముఠాతగాదాలు పడలేక రాజీనామా చేసి బెంగాల్ ల్యాంప్ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. కరాచీలో పోస్టింగ్ వచ్చింది. భారత దేశానికి స్వాతంత్య్రం రావడం, దేశ విభజన జరగడంతో కరాచీ పాకిస్తాన్ లో భాగమయింది. శాఫ్రనీ హైదరాబాద్ తిరిగొచ్చారు. స్వాతంత్య్రానంతరం భారత ప్రభుత్వం ఇండియన్ ఫారిన్ సర్వీస్ లోకి తీసుకుంది. చైనా, స్విజర్లాండ్, ఇరాక్, సిరియా, డెన్మార్క్ వంటి దేశాలలో దౌత్య వేత్తగా పనిచేసి 1969లో రిటైరయ్యారు.1984లో చనిపోయారు. నేతాజీ మేనల్లుడు అబిద్ మేనకోడలిని పెళ్లి చేసుకున్నారు.

నూరుకోట్ల జనం నోళ్ల నానుతున్న జైహింద్ నినాదం అందించిన  ప్రభుత్వాలకుఅబిద్ పెద్దగా గుర్తు లేకపోవడం విచారకరం. ఆయన పేర తెలంగాణ హైదరాబాద్ లో కూడా ఏ కార్యక్రమం జరగ లేదు. ఆయన ఓట్లకు పనికొచ్చే రాజకీయ నాయకుడు కాకపోవడే శాపమేమో.

Recent Posts

30 ఇయర్స్ పృథ్వీ ఇప్పుడు ఏం చేస్తురో తెలుసా?

టాలీవుడ్ కమెడియన్ 30 ఇయర్స్ పృథ్వీ‌ ఏమైపోయారు, ఎక్కడున్నారు? తెలుగు సినీ ఇండస్ట్రీ మొత్తం ఆయనను దూరం పెట్టిందా? ఆయన చేసిన ఓ చిన్న తప్పిదానికి రాజకీయ భవిష్యత్తు కూడా ముగిసిపోయిందా..? తెలుగు సినీ...

‘ఆపరేషన్ నమస్తే’ రంగంలోకి దిగిన ఆర్మీ.. ఏం చేయబోతోంది?

ప్రపంచ దేశాలను వణికిస్తూ విలయ తాండవం చేస్తోన్న కరోనా కట్టడికి కేంద్రం నడుంబిగించింది. ఇప్పటికే దేశంలో లాక్ డౌన్ ప్రకటిచగా ఇప్పుడు ఆర్మీని రంగంలోకి దింపింది. 'ఆపరేషన్ నమస్తే' పేరిట కరోనాపై యుద్ధనికి...

తిరుమలలో కొండెక్కిన అఖండ దీపం..?!

క‌రోనా ప్రభావంతో తిరుమల శ్రీవారి ఆలయం సహా దేశంలోని ప్రముఖ ఆలయాలన్నీ మూతపడ్డ విషయం విధితమే. అయితే భక్తులకు దర్శనాన్ని ఆపేసినా తిరుమలలో స్వామివారికి నిత్యం నిర్వహించే పూజలు, కైంకర్యాలు మాత్రం యథావిధిగా...

మాస్ట‌ర్ మైండ్ ఎందుకు ఫెయిల‌య్యాడు?

ఇండ‌స్ట్రీలో వున్న నిర్మాత‌ల్లో అల్లు అర‌వింద్ మాస్ట‌ర్ మైండ్ అన్న విష‌యం తెలిసిందే. ఎంత ప్ర‌తికూల ప‌రిస్థితుల్ని అయినా త‌న‌కు అనుకూలంగా మార్చుకోవ‌డంలో అల్లు అర‌వింద్‌ని మించిన వారు లేర‌న్న‌ది ఇండస్ట్రీ వ‌ర్గాల...

ప్ర‌దీప్ మాచిరాజు మళ్లీ మొద‌లుపెట్టాలా?

ప్ర‌దీప్ మాచిరాజు.. బుల్లితెర‌పై స‌క్సెస్‌ఫుల్ యాంక‌ర్‌. ప్ర‌ముఖ టెలివిజ‌న్ ఛాన‌ల్‌లో ప్ర‌దీప్ త‌న పేరే వినిపించేలా చేసుకున్నాడు. అయితే బుల్లితెర‌పై క్రేజ్‌ని సొంతం చేసుకున్న ప్ర‌దీప్‌కు వెండితెర‌పై ఆక‌ట్టుకోవాల‌నే ఆశ మొద‌లైంది. దీంలో...

మ‌నోజ్‌కు విష్ణు ఇచ్చిన స‌ల‌హా ఏంటీ?

హీరో మంచు మ‌నోజ్ ఇటీవ‌ల అత‌ని భార్య‌తో విడిపోయాడు. ఈ విష‌యాన్ని వెల్ల‌డించ‌డానికి చాలానే స‌మ‌యం తీసుకున్నాడు. వ‌రుస పుకార్ల త‌రువాత సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న భార్య‌తో విడిపోయిన‌ట్టు వెల్ల‌డించాడు. ఆ...

భ‌ళా రాజ‌మౌళి భ‌ళా…ఎవ్వ‌రినీ తగ్గించ‌లేదే!

తెలుగులో మ‌ల్టీస్టార‌ర్ చిత్రాల‌కి ప్ర‌ధాన అడ్డంకి ఇద్ద‌రు హీరోల‌కు స‌మ ప్రాధాన్య‌త‌. కథ డిమాండ్ చేసినా చేయ‌కపోయినా ఇద్ద‌రు హీరోల్లో ఏ ఒక్క‌రికీ ప్ర‌ధాన్యం పెర‌గ‌కూడ‌దు త‌గ్గ‌కూడ‌దు. పెరిగితే త‌గ్గిన హీరో ఫ్యాన్స్...

పోగొట్టుకున్న చోటే వెతుక్కుంటోన్న చంద్రబాబు!

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రులు ఎవరూ ఉండరు అనే నానుడి మరోసారి రుజువవుతోంది. రాజకీయాల్లో గెలుపు, ఓటములు ఎప్పుడు ఎవరిని ఎటువైపుకి నడిపిస్తాయో.. ఎలాంటి నిర్ణయాలు తీసుకునేలా చేస్తాయో ప్రస్తుతం మాజీ...

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

కేసీఆర్ మాటల ఆంతర్యం అదేనా?

ప్రస్తుత కష్టకాలంలో తెలంగాణలో ఎవరూ ఆకలితో అలమటించకుండా చూసే బాధ్యత తీసుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రజల, విద్యార్థులను కూడా కాపాడుకుంటామని పెద్ద మనసు చాటుకునన్నారు. ఈ విషయంలో ఎవరూ ఏ...

Featured Posts

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

వీరికి  లాక్ డౌన్ వర్తించదా?

 ప్రపంచంలోని నూట తొంభై అయిదు దేశాలను గడగడలాడిస్తూ, ఇప్పటివరకు పద్దెనిమిది వేలమంది ప్రాణాలను తీసి, లక్షలాదిమందికి ఆసుపత్రుల పాలు చేసిన భయంకరమైన కరోనా వైరస్ (కోవిద్ 19 ) ఆ రెండుమూడు గ్రామాల...

షాకింగ్‌…. క‌ర్ఫ్యూ మొత్తం 21 రోజులు… క‌రోనా క‌ట్ట‌డికి ఇదే మార్గం..!

వేలాది మందిని నిలువునా పొట్ట‌పెట్టుకుంటున్న క‌రోనా దెబ్బకు ప్ర‌పంచం మొత్తం మూత‌బ‌డుతోంది. దేశ దేశాల‌న్నీ విధిలేక క‌ర్ఫ్యూ విధిస్తున్నాయి. భార‌త్‌లో ఇప్ప‌టికే వారం రోజుల పాటు పూర్తిగా ర‌వాణా నిలిపివేశారు. దాదాపు 75...