Home News Andhra Pradesh 'జగన్'న్నాథ రథచక్రాల కిందపడి నలిగిపోయిన మందుబాబులు

‘జగన్’న్నాథ రథచక్రాల కిందపడి నలిగిపోయిన మందుబాబులు

లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా కేంద్రం మద్యం దుకాణాలను తెరుచుకోవచ్చని అనుమతులు ఇచ్చింది.  దీంతో అన్ని రాష్ట్రాలతో పాటు సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని సాధించి తీరుతాం అంటూ సవాల్ చేసిన వైఎస్ జగన్ ఏపీలో మద్యం విక్రయాలకు పచ్చ జెండా ఊపారు.  అది కూడా 25 శాతం రేట్లను పెంచుతూ విక్రయాలు స్టార్ట్ చేశారు.  సుమారు 40 రోజుల తర్వాత మందు అమ్మకానికి పెట్టడంతో మందుబాబులే కాదు అరకొరగా తాగే వారు కూడా ఎగబడి బ్రాండ్ ఏదైనా సరే మందు కొనుగోలు చేశారు.  ఈ అమ్మకాల ద్వారా మే 4 తొలిరోజున రూ.70 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి.  ఈ మొత్తంలో ప్రభుత్వానికి 60 శాతం ఆదాయం అందింది.  లాక్ డౌన్ పరిస్థితుల్లో కూడా ఈ స్థాయి అమ్మకాలంటే రికార్డ్ అనే అనాలి. 
 
ఆ తర్వాత వైఎస్ జగన్ ఇంకో 50 శాతం ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.  దీంతో మందుబాబులు ఇంత భారీగా ధరలు పెంచడం అంటే మమ్మల్ని దోచుకోవడమేనని, మందుకు అలవాటుపడిన తమ బలహీనతను ఇలా క్యాష్ చేసుకుంటారా అంటూ తిడుతూనే లిక్కర్ షాపుల ముందు క్యూలు కట్టారు.  ఇక వారి కుటుంబ సభ్యులైతే నిషేదం చేస్తానని ఈ లాక్ డౌన్ సమయంలో షాపులు తెరవడం ఏమిటి, 75 శాతం ధరలు పెంచడం ఏమిటి.  ఈ చర్యతో దాచుకున్న డబ్బు, సర్కార్ నుండి అందిన 1000, 500ల ఆర్థిక సహాయం అన్నీ మద్యం కోసమే ఖర్చువడంతో మరింత కుంగిపోయామని వాపోతున్నారు. 
 
మరోవైపు సర్కార్ మాత్రం 75 శాతం ధరలు పెంచి, 13 శాతం షాపులను తొలగించడం వలన విక్రయాలు తగ్గాయని అంటూ తాజా విక్రయాలను మే 4వ తేదీ విక్రయాలతో, గతేడాది లెక్కలతో పోల్చి చూపుతున్నారు. అసలు లాక్ డౌన్ రోజులకు సాధారణ రోజులకు అమ్మకాల్లో పోలిక సరైనది కానేకాదు.  ఈ తేడాను చూపి మద్య నిషేధంలో గొప్ప ఫలితాల్ని సాధించామనడం సమంజసం అనిపించుకోదు.  ఇక రోజువారీ విక్రయాలు తగ్గడానికి మందుబాబుల జేబులు ఖాళీ అవడం, షాపుల్లో నిల్వలు నిండుకోవడం ప్రధాన కారణాలు.  అంతేకానీ సర్కార్ చర్యలతో మందుబాబుల్లో ఎలాంటి మార్పూ రాలేదు సరికదా ఆర్థికంగా మరింత చితికిపోయారు కూడ.  
 
 

Telugu Latest

వైజాగ్ రాజధానిగా జగన్ సంకల్పం నెరవేరేదా?

విశాఖపట్నం అంటే అది ఒక సుందరనగరమని, నయానందకరమైన సాగరం,   నాలుగైదు బీచ్ లు, అతి పురాతనమైన భీమిలి బీచ్, వంద కిలోమీటర్ల దూరంలో ప్రకృతి సౌందర్యానికి నిలయమైన అరకు లోయ, బొర్రా గుహలు,...

ప్ర‌యివేటు ఆసుప‌త్రుల‌కు సీఎం జ‌గ‌న్ వార్నింగ్!

ప‌క్క రాష్ర్ర్టం తెలంగాణ లో కార్పోరేట్ ఆసుప‌త్రులు క‌రోనా చికిత్స పేరు ఎలా దోచుకుంటున్నాయో తెలిసిందే. అడ్డ‌గోలు గా..ల‌క్ష‌ల‌కు ల‌క్ష‌ల రూపాయ‌లు చికిత్స పేరుతో పేద‌ల కుటుంబాల ర‌క్తాన్ని జ‌ల‌గ‌ల్లా పీల్చుతున్నాయి. చ‌నిపోయిన...

విశాఖ బ్రాండ్ ఇమేజ్ కోసం.. జ‌గ‌న్ మాస్ట‌ర్ ప్లాన్..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విశాఖ‌ప‌ట్నంలో జ‌రుగుతున్న వ‌రుస ప్ర‌మాదాలు జరుగుతున్న నేప‌ధ్యంలో పై వైసీపీ స‌ర్కార్ సీరియ‌స్‌గా తీసుకుంది. వైసీపీ అధికారంలోకి రావ‌డంతోనే విశాఖ‌ను ప‌రిపాల‌న రాజ‌ధానిగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ప్ర‌తిప‌క్షాలు...

కథల అన్వేషణలో స్టార్ హీరోలు !

కథ అనేది ఎంత కొత్తగా ఉంటే.. ఆ సినిమా అంత గొప్ప విజయతీరాలకు చేరుకుంటుందని ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ ఏక కంఠంతో అంగీకరించే విషయం. అయితే సినిమాల్లో ఎక్కువుగా కథకు ఎక్కువ ఇంపార్టెన్స్...

విశాఖ వరుస ప్రమాదాల పై అనుమానాలు..!

ఏపీ పరిపాలన రాజధాని విశాఖలో జరుగుతున్న వరుస సంఘటనలు నగర వాసులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. సాగర తీరాన సాఫీగా జీవనం గడిపే పరిస్థితి కనిపించడం లేదు. ఇటీవల ఎల్జీ పాలిమర్స్, సాయినార్...

English Latest

Surya to turn a baddie in his OTT debut

Mani Ratnam is producing a web series that has been titled Navarasa. The series will have nine episodes and will be directed by nine...

Can RGV dare KCR and Jagan?

Maverick director Ram Gopal Varma is known for his daring and dashing attitude. Though he is known for his insane acts, no one has...

What did YV.Subba Reddy give to Union Minister

Everyone is aware that former AP CM Chandra Babu Naidu failed to get things from the Union Government asking them the right favours at...

Letter Head giving shock to Jagan

YSRCP which sent show cause notice to its MP Raghurama Krishnam Raju is getting shocks as the matter reached the Delhi High Court. The...

Hot Hunk to take on Mega Star

Mega Star Chiranjeevi is lining up interesting and crazy projects during the lockdown. He is starring in Acharya under the direction of Koratala Shiva...

Gallery of the Day

Actor/Actress/Celebrity

Glamour Show