‘మ్యాస్ట్రో’ ప్యాకప్… జెడ్ స్పీడ్ లో దూసుకుపోతున్న నితిన్!

కరోనా కారణంగా చిత్ర పరిశ్రమలో ఏర్పడిన ప్రతికూల వాతావరణంలో కూడా హీరో నితిన్ జెడ్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాదిలో ఇప్పటికే చెక్, రంగ్ దే రెండు చిత్రాలు విడుదలచేసి, ఇప్పుడు మరో సినిమా కూడా సిద్ధం చేస్తున్నాడు. బాలీవుడ్ హిట్ మూవీ ‘అంధాదున్’ రీమేక్‌ గా తెలుగులో నితిన్ ప్రధాన పాత్రధారిగా రూపొందుతున్న చిత్రం ‘మ్యాస్ట్రో’. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ విజృంభణ తగ్గిన తర్వాత ఈ సినిమా ఫైనల్‌ షెడ్యూల్‌ చిత్రీకరణ ఇటీవల హైదరాబాద్‌లో మొదలైంది. అయితే ఈ రోజు షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

Nithin Movie Maestro Shooting Completed
nithin movie maestro shooting completed

ఇప్పటికే నితిన్‌ బర్త్‌‌డే సందర్భంగా విడుదల చేసిన ‘మ్యాస్ట్రో’ ఫస్ట్‌లుక్, టీజర్‌ తో ఈ సినిమా మీద మంచి క్రేజ్ నెలకొంది. శ్రేష్ఠ్ మూవీస్‌ పతాకంపై రాజ్‌ కుమార్‌ ఆకెళ్ళ సమర్పణలో ఎన్‌.సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో నభా నటేశ్ కథానాయికగా నటిస్తుండగా, తమన్నా ఒక కీలకమైన పాత్రను పోషిస్తోంది.

గత రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేయటంతో నితిన్ ఈ సినిమాతో హిట్ అందుకోవాలని పట్టుదలతో ఉన్నాడు. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటిస్తారని సమాచారం. ఈ మూవీ తర్వాత తనకు ‘భీష్మ’ లాంటి హిట్ ఇచ్చిన వెంకీ కుడుములకు మరోసారి ఛాన్స్ ఇచ్చాడు నితిన్. అలానే వక్కంతం వంశీతో కూడా ప్రాజెక్ట్ సెట్ అయ్యిందని తెలుస్తుంది. పెళ్లి తర్వాత నితిన్ కెరీర్ మంచి జోష్ లో ఉందని తెలుస్తుంది.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles