హ‌రీష్‌శంక‌ర్ పంచ్‌లేసింది ఎవ‌రిపైనా?

క‌రోనా విల‌యం: సుర‌భి క‌ళాకారుల్ని ప్ర‌భుత్వాలు గాలికొదిలేశాయా?

హ‌రీష్‌శంక‌ర్‌.. సినిమాల‌తో సంబంధం లేకుండా వార్త‌ల్లో నిలుస్తుంటారు. `వాల్మీకి` టైటిల్ స‌మ‌యంలోనూ, ఇటీవ‌ల క్రిస్టియ‌న్ సాంగ్ విష‌యంలోనూ వివాదాస్ప‌దంగా స్పందించిన హ‌రీష్‌శంక‌ర్ తాజాగా చేసిన ట్వీట్ హాట్ టాపిక్‌గా మారింది. త‌న‌కు న‌చ్చ‌ని విష‌యాన్ని నిర్భ‌యంగా చెప్ప‌డం హ‌రీష్‌కు అల‌వాటు అదే వివాదాల‌కి కార‌ణంగా మారుతోంది.

`నేనూ గెల‌వాలి… all the best నేను గెల‌వాలి … ok… నేనే గెల‌వాలి … sorry boss` హ‌రీష్‌శంక‌ర్ ట్వీట్ పెట్టాడు. అయితే ఈ ట్వీట్ ఏ సంద‌ర్భంలో పెట్టారో కానీ దాన్ని సంక్రాంతి క‌లెక్ష‌న్‌ల‌కి అన్వ‌యించేస్తున్నారు. సంక్రాంతి బ‌రిలో పోటీప‌డిన `స‌రిలేరు నీకెవ్వ‌రు`, అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యాల్ని సాధించాయి. మా సినిమా 180 కోట్లు దాటేసింద‌ని ఒక‌రంటే మా సినిమా 200 ప్ల‌స్ కోట్లు దాటేసింద‌ని వ‌రుసగా పోస్ట‌ర్‌లు రిలీజ్ చేస్తున్నారు.

హ‌రీష్ ట్వీట్‌ని బ‌ట్టి నేను గెల‌వాల‌ని ఒక‌రు, నేను మాత్ర‌మే గెల‌వాల‌ని మ‌రొక‌రు పోటీప‌డుతున్నారు. దీంతో ఇదే ఇప్ప‌డు హాట్ టాపిక్‌గా మారింది. అయితే హ‌రీష్ పెట్టిన ఉద్దేశం వేరు అంతా దాన్ని అన్వ‌యించుకుంటున్న తీరు వేర‌ని కొంత మంది వాదిస్తున్నారు.