సంక్రాంతి బరిలో విడుదలైన సూపర్‌స్టార్ మహేష్‌బాబు `సరిలేరు నాకెవ్వరు` చిత్రం. మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కింది. ఈ చిత్రం టాక్ వచ్చేసరికి పెద్దగా హిట్ కాలేదనే చెప్పాలి. పండగకి విడుదలైన నాలుగు చిత్రాల్లో కాస్తో కూస్తో బన్నీ నటించిన అలవైకుంఠపురం బావుందని అంటున్నారు. కానీ సరిలేరు మాత్రం మిక్స్డ్ టాక్‌ను తెచ్చుకుంది. కానీ రోజు రోజుకు ఈ చిత్ర యూనిట్ విడుదల చేసే కలెక్షన్ల ఫిగర్లుమాత్రం మాములుగానే వేస్తున్నారు. దీంతో వీళ్ళు వేసే కలెక్షన్స్ అంకెలు నిజమా లేక అబద్ధమా అన్నది ఎవ్వరికీ అర్ధం కావడంలేదు.
ఓ పక్క సినిమా పై మంచి పాజిటివ్ టాక్ లేనప్పటికీ ఇలాంటి కలెక్షన్స్ సాధిస్తుందంటే ఎంత వరకు నమ్మాలో అర్ధం కావడం లేదు. ఇక ఈ చిత్రాన్ని హ్యాట్రిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం కమర్షియల్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కంది. ఈ సంక్రాంతికి మాస్ ఎంటర్టైనర్గా నిలిచింది.
పండగ సీజన్లో విడుదలవ్వడంతో కాస్తో కూస్తో ఓపెనింగ్స్, కలెక్షన్స్ వచ్చాయని చెప్పాలి. ఈ చిత్రం మొదటి వారం కలెక్షన్లు తెలుగు రాష్ట్రాలు రెండిటిలో 84కోట్ల వరకు షేర్‌ను సాధించింది. అలాగే రెండవ వారం కూడా అదే రేంజ్లో కలెక్షన్లు10వ రోజుతో తెలుగు రాష్ట్రాల్లో 100.91 కోట్ల వరకు టచ్ చేసింది.
గతంలో ఎప్పుడూ కూడా మహేష్ మార్కెట్ ప్రకారం 100 కోట్లు క్రాస్ చేసింది లేదు. దీంతో చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు వీరు చూపించే ఫిగర్స్ కరెక్టేనా అని. మొత్తానికి ఈ చిత్రాన్ని ఈ సంక్రాంతికి మాస్ ఎంటర్ టైనర్‌గా నిలుపుతున్నారు. కానీ ఈ చిత్రంలో కథ కథనాలు మాత్రం అస్సలు లేవనే చెప్పాలి. అనిల్ మార్క్ మ్యానరిజమ్స్ పెట్టి ఏదో జిమ్మిక్ చేయడం తప్ప కథలో ఎక్కడా బలం కనిపించలేదు. మరి ఈ కలెక్షన్స్‌ని ఎంత వరకు నమ్మాలో ఏమో మరి.
‘సరిలేరు నీకెవ్వరు’ ఆంధ్ర – తెలంగాణ 10 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్:
నైజాం – 32.9 కోట్లు
సీడెడ్ – 14.1 కోట్లు
గుంటూరు – 9.05 కోట్లు
ఉత్తరాంధ్ర – 16.62 కోట్లు
తూర్పు గోదావరి – 10.05 కోట్లు
పశ్చిమ గోదావరి – 6.57 కోట్లు
కృష్ణా – 7.97 కోట్లు
నెల్లూరు – 3.65 కోట్లు
10 రోజుల మొత్తం షేర్ – 100.91 కోట్లు