స్వప్న సినిమాస్ బ్యానర్లో నందినీ రెడ్డి చిత్రం

నిర్మాత అశ్విని దత్ పుత్రికలు స్వప్న. ప్రియాంక దత్ లు ఆయన సొంత బ్యానర్ వైజయంతి మూవీస్ ని కాదని తాము సొంతంగా ‘స్వప్న సినిమాస్’ అనే బ్యానర్ పై సినిమాలు చేస్తున్నారు. చేయడమే కాదు మంచి విజయాలు అందుకుంటున్నారు. అందుకు ‘మహానటి’ చిత్రమే ఉదాహరణ.

ఈ క్రమంలో వారు మళ్ళీ ఆ దర్శకుడు నాగ్ అశ్విన్ తో తమ బ్యానర్లో మరో సినిమా చేస్తున్నారు. మరో పక్క ‘ఓహ్ బేబీ’ సినిమా తో హిట్ ఇచ్చిన దర్శకురాలు నందినీ రెడ్డి తో ఒక సినిమా చేస్తున్నారు. ప్రస్తుత సామాజిక పరిస్థితులకు అనుగుణమైన ప్రేమ కథ. మిక్కీ జె.మేయ‌ర్ ఈ సినిమాకు సంగీత సార‌థ్యం వ‌హించ‌నున్నారు. ల‌క్ష్మీ భూపాల్ ర‌చయిత‌గా ప‌నిచేస్తున్నారు.