‘సైరా’ ప్రీ రిలీజ్ బిజినెస్ (ఏరియావైజ్)

‘సైరా’బిజినెస్ లెక్కలు..ఎక్కడ..ఎంతెంత

ఏ భాషలో అయినా స్టార్ హీరోల సినిమాల‌కు ట్రేడ్ లో ఉండే క్రేజే వేరు. సినిమా సెట్స్‌పై ఉండ‌గానే ప్రీ రిలీజ్ బిజినెస్ పూర్తైపోతూంటుంది. దానికి తోడు మెగాస్టార్ వంటి హీరో ఉంటే ఆ బిజినెస్ కు పోట్ల గిత్తల మధ్య పోటీ టైప్ లో కాంపిటేషన్ ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి` విష‌యంలో భారీ పోటీ నెల‌కొంది. దీంతో నిర్మాత‌లు ఫ్యాన్సీ రేటు రెండు రాష్ట్రాల థియేట్రిక‌ల్ హ‌క్కుల‌ను అమ్మార‌ని ట్రేడ్ వ‌ర్గాల స‌మాచారం.

సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజనెస్ 197.80 కోట్లదాకా జరిగిందని సమాచారం. ఇక్కడ ఏరియా వైజ్ బ్రేకప్ చూద్దాం :

ఏరియా బిజినెస్ (కోట్లలో)

——————– —————————————-

నైజాం 30.00

సీడెడ్ 22.00

నెల్లూరు 5.20

కృష్ణా 9.60

గుంటూరు 11.50

వైజాగ్ 14.40

ఈస్ట్ గోదావరి 10.40

వెస్ట్ గోదావరి 9.20

మొత్తం ఆంధ్రా & తెలంగాణా 112.30

కర్ణాటక 28.00

తమిళనాడు 7.50

కేరళ 2.50

భారత్ లో మిగతా ప్రాంతాలు 27.50

ఓవర్ సీస్ (హిందీతో కలిపి) 20.00

ప్రపంచ వ్యాప్తంగా మొత్తం బిజినెస్ 197.80

మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం‘సైరా నరసింహారెడ్డి’.ఈ సినిమా కోసం ఓ ప్రక్క మెగా ఫ్యాన్స్ మరో ప్రక్క సినీ లవర్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని 270 కోట్ల భారీ బడ్జెట్‌ తో రామ్ చరణ్ నిర్మించారు. అలాగే ఈ బడ్జెట్ లో మెగాస్టార్ చిరంజీవి పారితోషికం 40 కోట్లు అని తెలుస్తోంది. అయితే ఆయన తన రెమ్యునేషన్ ఏమీ తీసుకోలేదట. మెగాస్టార్ కి హోమ్ ప్రొడక్షన్ కాబట్టి, ఆయన లాభాలలో షేర్ ను తీసుకుంటారట. ఇక ఈ చిత్రం తెలుగు సినిమాల్లోనే అతిపెద్ద చిత్రంగా రాబోతుంది.

పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సినిమాలో లెజెండ్ అమితాబ్ బచ్చన్ నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్నగా కనిపించనున్నారు. ఇక ఈ సినిమాలో సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క వంటి స్టార్ లు కూడా నటిస్తున్నారు. హిందీ, కన్నడ మరియు తమిళ ప్రేక్షకులు కూడా సినిమా పై ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది.