Home Tollywood `సైరా` ట్రైల‌ర్‌ లో ఇవన్నీ మనం చూడచ్చు

`సైరా` ట్రైల‌ర్‌ లో ఇవన్నీ మనం చూడచ్చు

`సైరా` ట్రైల‌ర్‌ లో ఉండే షాట్స్ ఇవే

మ‌రి కొద్ది గంట‌ల్లో `సైరా` ట్రైల‌ర్ విడుద‌ల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో మెగాభిమానులందరిలోనూ ఒకటే ప్రశ్న… ఈ ట్రైల‌ర్ ఎలా ఉంటుంది..క్రేజ్ ని పీక్స్ కు తీసుకెళ్తుందా? అని. కేవం మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు టాలీవుడ్ కూడా ఆస‌క్తిగా ఈ ట్రైలర్ కోసం ఎదురు చూస్తోంది. ఎందుకంటే ఇప్పటిదాకా ఈ సినిమాకు సరైన ఊపు తెచ్చే ప్రమోషన్ స్టార్ట్ కాలేదు. పేరుకు పాన్ ఇండియా సినిమా అంటున్నారు కానీ ఆ వేడి ఎక్కడా కపడటం లేదు. దాంతో ఈ ట్రైల‌ర్‌ని బ‌ట్టి సినిమా స్టామినా ఎంతో తేలిపోనుందని లెక్కలేస్తున్నారు.

అయితే.. ఈ విషయాలన్నిటినీ చిత్రం టీమ్ పరిగణనలోకి తీసుకుందని తెలుస్తోంది. దాంతో ట్రైల‌ర్ విష‌యంలో దర్శక,నిర్మాతలు చాలా జాగ్ర‌త్త వ‌హించిన‌ట్టు తెలుస్తోంది. నిర్మాత రామ్ చరణ్ సూచనలు మేరకు సినిమాలో కీల‌క‌మైన ఎపిసోడ్ల‌ని ఈ ట్రైల‌ర్‌తో ప‌రిచ‌యం చేయ‌బోతోంద‌ని తెలుస్తోంది. ఆ కీలకమైన ఎపిసోడ్స్ ఏమిటి..ట్రైలర్ లెంగ్త్ ఎంత అంటే…

అందుతున్న సమాచారం మేరకు ఈ …. ట్రైల‌ర్ లెంగ్త్ దాదాపు 3 నిమిషాలు ఉండ‌బోతోంద‌ట‌. ఈ మూడు నిముషాల్లోనే …యుద్ధ స‌న్నివేశాలు, ఎమోష‌న్ సీన్లు, డైలాగుల‌కు ట్రైల‌ర్‌లో ప్రాధాన్యం ఇచ్చిన‌ట్టు సమాచారం. అలాగే టీజ‌ర్‌లో వదిలేసిన విషయాల ప్రస్దావన ఈ ట్రైలర్ లో ఉంటుందిట. ఎందుకంటే టీజర్ కేవ‌లం చిరంజీవిపైనే ఫోక‌స్ పెట్టింది.

దాంతో ట్రైల‌ర్‌లో మాత్రం అన్ని క్యారక్టర్స్ కూ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక ఉయ్యాల వాడ న‌ర‌సింహారెడ్డి గొప్ప శివ భ‌క్తుడు అనే విషయం ఎస్టాబ్లిష్ చేస్తారట. అలాగే బ్రిటీష్ సామ్రాజ్యాన్ని చూపెడతారట. ఇక త‌మ‌న్నా నాట్యం, వార్ ఎపిసోడ్లు, విలన్స్ అయిన బ్రిటీష్ వాళ్ల అరాచ‌కాలు ఇవన్నీ ట్రైల‌ర్‌లో చూపించ‌బోతున్నారు. ఇక ట్రైలర్ లోనూ చిరంజీవి బ్రిటీష్ సైనికుల్ని మట్టుపెట్టే షాట్స్ ఉంటాయ. ట్రైల‌ర్ ఓ విజువ‌ల్ వండ‌ర్‌గా ఉండ‌బోతోంద‌ని స‌మాచారం. ఈసాయింత్రం 5గంట‌ల 31 నిమిషాల‌కు సైరా ట్రైల‌ర్ విడుద‌ల కాబోతోంది.

Related Posts

‘మా’ రాజకీయం: తెలుగు నటుల ఆత్మగౌరవం కోసం.?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అంటే, అది తెలుగు సినీ నటీనటుల ఆత్మగౌరవం కోసమా.? ఇప్పుడీ చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది. 'మా' ఆత్మగౌరవం.. అంటూ మంచు విష్ణు ఇచ్చిన స్లోగన్ చుట్టూ చిత్ర...

పోసానిది ఆవేదన కాదు.. జుగుప్సాకరమైన ప్రవర్తన.!

'నేను వైఎస్సార్సీపీ కార్యకర్తని.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిమానిని..' అంటూ పోసాని కృష్ణమురళి చెప్పుకుంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద అత్యంత జుగుప్సాకరమైన ఆరోపణలు చేస్తున్నారాయన. పవన్ కళ్యాణ్ అభిమానులు...

‘పెళ్లి సందడి’ భామకి అప్పుడే అంత క్రేజ్.?

'పెళ్లిసందడి' సినిమా అప్పట్లో ఓ పెద్ద సంచలనం. దర్శక రత్న రాఘవేంద్రరావు రూపొందించిన ఈ అద్భుత ప్రేమ కావ్యంలో శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ నటించిన సంగతి తెలిసిందే. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ...

Related Posts

ఈ పాప రేటు చాలా ‘హాటు’

'బేబమ్మ'గా తొలి సినిమా 'ఉప్పెన'తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ కృతిశెట్టి. తొలి సినిమా అనూహ్యమైన విజయం సాధించడంతో బేబమ్మను వరుస పెట్టి అవకాశాలు వరిస్తున్నాయి. ప్రస్తుతం కృతిశెట్టి చేతిలో నాలుగు సినిమాలకు...

Latest News