‘సైరా’కలెక్షన్స్ పై గొడవ…హ్యాష్ ట్యాగ్ కూడా

‘సైరా’ పేరు చెప్పి ఫ్యాన్స్ మధ్య యుద్దం

పెద్ద సినిమాలకు ఫేక్ కలెక్షన్స్ స్ప్రెడ్ చేయటం అనేది సర్వసాధారణం అయ్యిపోయింది. ఫేక్ హోరులో ఒక్కోసారి ఒరిజనల్ కలెక్షన్స్ కూడా కొట్టుకుపోతున్నాయి. అంతేకాకుండా ఈ కలెక్షన్స్ గురించి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య యుద్దాలే జరుగుతున్నాయి. తాజాగా సైరాకు ఈ సమస్య వచ్చింది.

‘సైరా’ విడుదలై 10 రోజులు దాటి పోయినా ఈ మూవీ కలక్షన్స్ గురించి ఎటువంటి అఫీషియల్ గా నిర్మాత రామ్ చరణ్ విడుదల చేయడం లేదు. దీనితో ఈ మూవీ కలక్షన్స్ విషయమై కేవలం రూమర్స్ మాత్రమే హడావిడి చేస్తున్నాయి. మరో ప్రక్క ఈ మూవీ ఇప్పటికే 200 కోట్ల కలక్షన్స్ ను క్రాస్ చేసింది అంటూ వార్తల హడావిడి జరుగుతూ ఉన్నా ఈ విషయమై మెగా కాంపౌండ్ స్పందించడం లేదు.

ఇదిలా ఉంటే…చిరంజీవి చరణ్ లు ఈ సినిమా ని రికార్డుల కోసం తీసింది కాదు అని చెపుతున్నారు. తమకు చేతనైంతలో ఈ మూవీని ఎంత వరకు ప్రమోట్ చేయాలో అంత వరకు ప్రమోట్ చేసి వీకెండ్ లో కూడ ‘సైరా’ కలక్షన్స్ విషయంలో నిలబెట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో #SyeRaaFakeCollections అంటూ ఒక హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఈ హ్యాష్ ట్యాగ్ కింద కొన్ని పోస్టులలో కొన్ని బుక్ మై షో అడ్వాన్స్ బుకింగుల ఇమేజిలను పోస్ట్ చేస్తున్నారు.

మొదట్లో ‘సైరా’ ఓవర్సీస్ రైట్స్ ను నాలుగు మిలియన్ డాలర్లకు అమ్మకం జరిగిందని ప్రచారం చేసి ఇప్పుడు హఠాత్ గా ఆ ఫిగర్స్ ను మూడు మిలియన్ డాలర్స్ కు ఎందుకు తగ్గించివేసారు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. మరి కొందరైతే ‘సైరా’ గ్రాస్ కలక్షన్స్ ను నెట్ కలక్షన్స్ గా చూపెట్టి ఈ మూవీని హిట్ అన్న ప్రచారం చేస్తున్నారని అంటూ దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు.