సీన్ రివర్స్:‘బన్నీ వాసు నన్నెప్పుడు వేధించలేదు’

బన్ని వాసు మేటర్ రివర్సైంది

నిన్నంతా బన్ని వాసు తనను వేధించాడంటూ మీడియాకు ఎక్కిన సునీత ఇప్పుడు ప్లేట్ ఫిరాయించారు.ప్రొడ్యూసర్‌ బన్నీ వాసు తనను ఎప్పుడు శారీరకంగా హింసించలేదని, తప్పుడు ప్రచారం చెయ్యవద్దని స్పష్టం చేశారు. బన్నీ వాసు తనను శారీరకంగా హింసించాడని వస్తున్న వార్తలను సునీత ఖండిస్తూ… ఓ వీడియోను షేర్‌ చేశారు. అలాగే బన్నీ వాసుపై తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదని తన ఫేసుబుక్‌ ఖాతాలో వీడియో పోస్ట్ ద్వారా తెలియజేశారు.

జనసేన పార్టీలో ఉన్న సమయంలో తాను నిర్మాత బన్నీ వాసును ఒకటి రెండు సార్లు స్వయంగా కలిశానని తెలిపారు. తర్వాత ఆయనను కలవడానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా.. అపాయింట్‌మెంట్‌ దొరకలేదని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన్ని కలవడానికే నిరసన చేస్తున్నట్లు తెలిపారు. అంతేగానీ అవాస్తవాలను ప్రచారం చేయొద్దని కోరారు.

నిన్న మీడియాలో వార్తలను గుర్తు చేసుకుంటే.. సినిమా అవకాశాల పేరుతో ప్రముఖ దర్శకుడు బన్ని వాసు తనను మోసం చేశారని, జనసేన పార్టీ కోసం కష్టపడితే తనను ఆదుకుంటానని చెప్పిన ఆ పార్టీ నేతలు తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపిస్తూ జూనియర్‌ ఆర్టిస్ట్‌ సునీత బోయ బుధవారం తెల్లవారుజామున ఫిలించాంబర్‌ గేటుకు తనను తాను గొలుసులతో బంధించుకొని నిరసన తెలిపింది.

ఆమె మాట్లాడుతూ జనసేన పార్టీ కోసం కష్టపడితే తనను ఆదుకుంటానని చెప్పి ఇప్పుడు తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించింది. తనకు జరిగిన మోసంపై సినీ నిర్మాత అల్లు అరవింద్‌ స్పందించి అక్కడికి వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేసింది. గతంలో తాను శ్రీరెడ్డికి సోషల్‌ మీడియా వేదికగా జనసేన తరపున కౌంటర్‌ ఇచ్చిన విషయం కూడా గుర్తు చేశారు. ఇప్పుడిలా సీన్ రివర్సైంది.

కాగా బన్నీ వాసు ప్రస్తుతం అఖిల్‌ అక్కినేని నటిస్తున్న ఓ సినిమా షూటింగ్‌ పనుల్లో బిజీగా ఉన్నారు.