Home Tollywood 'సాహో' పోస్టర్ పై పడ్డారే, తెగ ట్రోలింగ్

‘సాహో’ పోస్టర్ పై పడ్డారే, తెగ ట్రోలింగ్

ఇట్స్ ట్రోలింగ్ టైమ్ అంటున్నారు

యంగ్ రెబ‌ల్‌ స్టార్ ప్ర‌భాస్ హీరోగా న‌టించిన సాహో అంచ‌నాల‌ను అందుకోవ‌డంలో విఫ‌ల‌మైంది. భారీ అంచ‌నాల న‌డుమ రిలీజ్ అయిన ఈ సినిమాకు ఊహించని విధంగా దారుణ‌మైన రివ్యూలు వ‌చ్చాయి. ఇక బాలీవుడ్ మీడియా అయితే ఈ సినిమాని దుమ్మెత్తిపోసింది. అక్కడ రేటింగ్ లు అయితే మరీ దారుణంగా ఉన్నాయి.

పోనీ జనాలకు నచ్చుతోందా అంటే వాళ్ల నుంచి వచ్చిన రిపోర్ట్ సైతం సినిమాకు పాజిటివ్ గా లేవు. విషయం త‌క్కువ హడావిడి ఎక్కువ‌ అంటూ నేరుగా మైకులు ముందు అభిమ‌నులే పెద‌వి విర‌చేయ‌డం యూనిట్ ని గంద‌ర‌గోళానికి గురి చేస్తోంది. ఇక‌ సోష‌ల్ మీడియా సంగతి అయితే చెప్పక్కర్లేదు. సాహాపై దారుణ‌మైన ట్రోలింగ్స్ న‌డుస్తున్నాయి.

Saaho 2 | Telugu Rajyam

రిలీజ్ కు ముందు ఆహో..ఓహో అన్నవాళ్లు సైతం …ఇప్పుడు ప్ర‌తీ విషయంలోనూ గుచ్చి గుచ్చి మ‌రీ ట్రోల్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా సాహోలో మిష‌న్ గ‌న్ ని పోలిన‌ ఓ తుపాకీతో ప్ర‌భాస్ శ‌త్రువుల‌ను షూట్ చేస్తోన్న ఓ పోస్ట‌ర్ పై మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది.

<

p style=”text-align: justify”>ప్రభాస్ చేత్తో పట్టుకున్న ఆ తుపాకీ చూడ‌టానికి చిన్న పిల్ల‌లు దీపావ‌ళి స‌మ‌యంలో ఆడుకునే బొమ్మ తుపాకీలానే ఉంద‌ని తేల్చేసారు. దీపావళి తుపాకీ లో టేపులు పెట్టి పేల్చిన‌ట్లు ఉంద‌ని కామెడీ చేస్తున్నారు. సినిమాలో ఎక్క‌డా తుపాకీ పేలుతోన్న ఫీల్ క‌ల‌గ‌లేద‌ని కామెంట్లు పెడుతున్నారు. మేకర్స్ మరీ ఈరేంజ్ కామెంట్లు ఊహించి ఉండ‌రు. అయితే ఈ ప్రచారంలో ఎక్కువ భాగం ప్ర‌భాస్ యాంటీ ఫ్యాన్స్ పాలుపంచుకుంటున్నారనేది నిజం.

- Advertisement -

Related Posts

తెగ కష్టపడుతోంది.. సమంత వర్కవుట్లు వైరల్

సమంత తన ఫిట్ నెస్‌కు ఎంతటి ప్రాముఖ్యతను ఇస్తుందో అందరికీ తెలిసిందే. వర్కవుట్లు చేయనిదో రోజును మొదలుపెట్టదు. ఒక వేళ ఉదయం చేసేందుకు కుదరకపోయినా రాత్రి అయినా సరే వర్కవుట్లు చేస్తుంది. అలా...

కూతురి ఫ్రెండ్ పార్టీ.. పబ్‌లో సురేఖా వాణి రచ్చ

టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి సోషల్ మీడియాలో ఎంతగా రచ్చ చేస్తుంటుందో అందరికీ తెలిసిందే. సురేఖా వాణి అని కాకుండా ఆమె కూతురు సుప్రిత కూడా దుమ్ములేపుతూ ఉంటుంది. తల్లీ కూతుళ్లు...

ఈ సారి హిట్ పక్కా.. నాగ శౌర్య ‘లక్ష్య’ టీజర్ వైరల్

యంగ్ హీరో నాగ శౌర్య ఓ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. ఇందుకోసం రకరకాల పాత్రలను, కథలను ఓకే చేస్తున్నాడు. వరుసగా సినిమాలను లైన్‌లోపెట్టేశాడు. ప్రస్తుతం నాగశౌర్య స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నాడు. లక్ష్య...

ఫుల్లుగా తగ్గించేందుకు రెడీ.. శ్రీముఖితో కలిసి విష్ణుప్రియ వర్కౌట్లు

శ్రీముఖి, విష్ణు ప్రియల స్నేహ బంధం గురించి అందరికీ తెలిసిందే. బుల్లితెరపై యాంకర్లుగా ఉన్న వీరు చివరకు ప్రాణ స్నేహితుల్లా మారిపోయారు. యాంకరింగ్‌లో శ్రీముఖి కాస్త సీనియరే అయినా కూడా విష్ణు ప్రియ...

Latest News