`సాహో` ఫ్లాఫ్ దెబ్బ `సైరా` బిజినెస్ పై
ఇండస్ట్రీలో సాహో దెబ్బ ప్రభావం కనపడటం మొదలైంది. ముఖ్యంగా ఓవర్ సీస్ లో ఈ సినిమా పూర్తిగా దారుణ కలెక్షన్స్ రావటంతో సైరాపై ఆ ప్రభావం కనపడింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన భారీ బడ్జెట్ చిత్రం `సైరా`. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యలవాడ నర్సింహారెడ్డి జీవితకథ ఆధారంగా అత్యంత భారీ బడ్జెట్తో రామ్చరణ్ ఈ సినిమాను నిర్మించాడు. సురందేర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వచ్చే నెల రెండో తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా హక్కుల కోసం భారీ పోటీ నెలకొన్నప్పటికీ ఓవర్సీస్లో మాత్రం తక్కువ రేటుకే ఇవ్వాల్సి వచ్చిం దట.
అందుతున్న సమాచారం మేరకు ..ఓవర్సీస్ రైట్స్ రూ. 20 కోట్లకు అమ్మాలని చరణ్ ఎన్ని ప్రయత్నాలు చేసినా కొనేందుకు ఎవరు ముందుకు రాకపోవడంతో చివరకు 15 కోట్లకు ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. సాహో రిలీజ్ రైట్స్ ఇచ్చిన సంస్థకే సైరా కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఇటీవల టాప్ హీరోల సినిమాలకు సైతం ఓవర్సీస్లో కలెక్షన్లు అనుకున్నట్టుగా రావడం లేదు. మహేష్ బాబు మహర్షి సినిమా వసూళ్లు సోసోగా ఉన్నాయి. ఇక సాహో దెబ్బ మామూలుగా లేదు. దీంతో అక్కడ బయ్యర్లు కూడా ఎంత పెద్ద సినిమా అయినా భారీ రేట్లు పెట్టడం లేదు.
`సాహో` సినిమా తీవ్ర నష్టాలను మిగల్చడంతో `సైరా`ను భారీ రేట్లకు కొనేందుకు ఏ సంస్థా ముందుకు రాలేదట. పైగా ఇటీవలి కాలంలో ఓవర్సీస్ మార్కెట్ సగానికి సగం పడిపోయింది. దీంతో 15 కోట్లకే `సైరా` ఓవర్సీస్ హక్కులను ఇచ్చేశారట. దాంతో సైరా కూడా ఊహించిన విజయాన్ని అందుకోలేకపోతే ఇక రానున్న రోజులలో టాప్ హీరోలకు సంబంధించిన భారీ సినిమాలు మార్కెట్ చేయడం చాల కష్టం అన్న మాటలు వినిపిస్తున్నాయి.