‘సాహో’ అమెరికా లో పరిస్దితి ఏంటి
భారీ ఎక్సపెక్టేషన్స్ మధ్య శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘సాహో’ . అయితే ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోవటంతో నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యిపోయింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కలెక్షన్స్ ఏ మేరకు వచ్చాయనేది హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా అమెరికా ప్రీమియర్లో 9,15,224 డాలర్లు వసూలు చేసినట్లు ట్రేడ్ లో లెక్కలు తేల్చారు. అయితే డిస్ట్రిబ్యూటర్స్ చిత్రాన్ని భారీ మొత్తానికి కొనుగోలు చేశారని, ఈ వసూళ్లతో వారు షాక్ అయ్యారని పేర్కొన్నారు. అమెరికాలో ప్రీమియర్ వసూళ్ల పరంగా ‘సాహో’ ఆరో స్థానంలో నిలిచినట్లు తెలిపారు.
ప్రీమియర్స్లో ‘బాహుబలి 2’ 2.4 మిలియన్ డాలర్లు, ‘అజ్ఞాతవాసి’ 1.52 మిలియన్ డాలర్లు, ‘బాహుబలి’ 1.39 మిలియన్ డాలర్లు, ‘ఖైదీ నంబర్ 150’ 1.29 మిలియన్ డాలర్లు, ‘స్పైడర్’ 1.00 మిలియన్ డాలర్లు రాబట్టగా.. ‘సాహో’ 915 వేల డాలర్లతో ఆరో స్థానంలో నిలిచింది. దీని తర్వాత ‘భరత్ అనే నేను’ 850 వేల డాలర్లు, ‘అరవింద సమేత’ 789 వేల డాలర్లు, ‘రంగస్థలం’ 725 వేల డాలర్లు, ‘సర్దార్ గబ్బర్ సింగ్’ 616 వేల డాలర్లు రాబట్టి తర్వాతి ఐదు స్థానాల్లో ఉన్నాయి.
‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటించిన సినిమా ఇది. సుజీత్ దర్శకుడు. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా చేసిన ఈ చిత్రం దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్తో రూపొందింది.