సమంతా… ఇది నిజమేనా?!

భిన్న పాత్రలకు, వైవిధ్యమైన సినిమాలకు కేరాఫ్‌గా నిలిచిన తార సమంత. ఓ పక్క కమర్షియల్ చిత్రాల్లో నటిస్తూనే.. మరో పక్క సమయం  దొరికినప్పుడల్లా మహిళా ప్రధాన ఇతివృత్తాలు గల  చిత్రాల్లోనూ నటిస్తూ అందర్నీ విశేషంగా అలరిస్తోంది.  

ఈ ఏడాది ‘జాను’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సమంత  ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందబోయే పాన్‌ ఇండియా సినిమాలో  నటించబోతుందనే వార్తలు టాలీవుడ్ అంతా చక్కర్లు కొడుతున్నాయి.

 దీంతోపాటు తాజాగా మరో వార్త సోషల్‌ మీడియాలో తెగ  వైరల్‌ అయ్యింది. అదేంటంటే.. మహిళా ప్రధానంగా సాగే ఓ సినిమాలో సమంత నటించనుందట. తెలుగుతో  పాటు హిందీ, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందించ బోతున్నారట!  ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ  ఈ సినిమాని పాన్‌ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే యత్నాల్లో ఉందట. సమంతా… ఇది నిజమేనా!? అని ఇండస్ట్రీ వర్గాలు అంతా ప్రశ్నిస్తున్నాయి. 

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles