`వీ` పోస్ట‌ర్ టాక్‌: దేనిని క‌త్తిరించేశాడో ఏమిటో!

నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్న 25వ‌ చిత్రం `వీ`. ఇంద్ర‌గంటి మోహ‌న కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో నాని రెండు విభిన్న పాత్ర‌లు పోషిస్తున్నాడు. ఒక పాత్ర‌లో విల‌న్ గా క‌నిపించ‌నుండ‌గా వేరొక పాత్ర స‌స్పెన్స్ అన్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇక వీ చిత్రంలో సుధీర్ బాబు కాప్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ సినిమా సెట్స్ లో ఉంది. ఇటీవ‌లే సుధీర్ బాబు లుక్ రిలీజైంది. తాజాగా నాని న్యూ లుక్ రివీలైంది. ఈ లుక్ తో సోష‌ల్ మీడియాలో దుమారం మొద‌లైంది.

నాని ఈ ఫోటోలో మునుప‌టి కంటే స్మార్ట్ లుక్ లో కనిపిస్తున్నాడు. డార్క్ లుక్ లో క‌నిపిస్తున్నాడు. పైగా ఏదో తీక్ష‌ణంగా ఆలోచిస్తున్నాడు. ఇంత‌కీ ఆ చేతులో క‌త్తెర నుంచి ర‌క్తం కారుతోంది. దేనిని క‌త్తిరించేశాడో ఏమిటో! ఏదో సీరియ‌స్ గేమ్ ఆడుతున్న‌ట్టే క‌నిపిస్తోంది ఈ లుక్ చూడ‌గానే. ఇక సుధీర్ బాబు లుక్ ఇంత‌కుముందు అల్ట్రా స్మార్ట్ గా క‌నిపించింది. షూటింగ్ స‌హా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్తి చేసి ఉగాది సంద‌ర్భంగా మార్చి 25న రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజ్‌ తేదీని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. సైరా న‌ర‌సింహారెడ్డి చిత్రానికి సంగీతం అందించిన అమిత్ త్రివేది `వీ` సినిమాకి బాణీలు స‌మ‌కూరుస్తున్నారు. ఈ సినిమా అనంత‌రం నాని నిన్ను కోరి ఫేం శివ నిర్వాణ ద‌ర్శ‌క‌తంలో ట‌క్ జ‌గ‌దీశ్ చిత్రం షూటింగ్ లో నానీ పాల్గొంటాడు.