వి.వి.వినాయక్… సీమ యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకుడు. అయితే సీన్ మారింది. సాయిధరమ్‌తేజ్‌తో చేసిన `ఇంటలీజెంట్` వినాయక్ కెరీర్లోనే అత్యంత డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా తరువాత వినాయక్‌తో సినిమా అంటే హీరోలు భయపడిపోయారు. సినిమాలు లేక ఖాలీగా వున్న వినాయక్‌ని హీరోగా మారిస్తే ఎలా వుంటుందనే ఐడియా శంకర్ డైరెక్షన్ టీమ్‌లో అసోసియేట్‌గా పనిచేసిన నరసింహారావుకు రావడం, ఆ ఐడియాని దిల్ రాజుకు చెప్పడంతో వినాయక్ హీరోగా `సీనయ్య` మొదలైంది.
దీని కోసం వినాయక్ చాలా వరకు బరువు తగ్గి హీరో లుక్ కోసం పెద్ద ప్రయాసే పడ్డారు. విగ్గుని తగిలించుకుని హీరోగా మారిపోయారు. కొంత వరకు షూటింగ్ జరిగింది. ఫస్ట్‌లుక్‌ని కూడా బయటికి వదిలారు. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ సినిమా మాత్రం ఆగిపోయిందని తెలిసింది. కారణం ఏంటా అని ఆరాతీస్తే దర్శకుడు నరసింహారావుకు, వినాయక్‌కు మధ్య క్రియేటీవ్ డిఫరెన్సెస్ తలెత్తాయని, ఆ కారణంగానే దర్శకుడు నరసింహారావు సినిమాను పక్కన పెట్టారని ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.
ప్రస్తుతం బంతి దిల్ రాజు కోర్టులో వుంది. ఆయన మరో దర్శకుడితో ఈ సినిమాని పూర్తి చేయిస్తాడా? లేక సినిమాని మొత్తానికే ఆపేస్తాడా? అన్నద మాత్రం తెలియాల్సి వుంది. వినాయక్ త్వరలో చిరుతో `లూసీఫర్` రీమేక్ కోసం రెడీ అవుతున్నాడు. ఇది మొదలైతే `సీనయ్య` మళ్లీ సెట్స్‌పైకి వెళ్లడం క@్టమే అంటున్నారు.