కొన్ని క్రేజీ కాంబినేషన్లు ఈగోల దగ్గర ఫెయిలవుతుంటాయి. కానీ కొన్ని కండీషన్ల దగ్గర ఫెయిలవుతున్నాయి. అలాంటి ఓ కండీషన్ కారణంగానే విజయ్ సేతుపతి – అల్లు అర్జున్‌ల క్రేజీ కాంబినేషన్‌కు బ్రేక్ పడినట్టు తెలుస్తోంది. `అల వైకుంఠపురములో` ఇండస్ట్రీ హిట్ తరువాత చేయబోయే సినిమా దానికి మించి వుండాలని అల్లు అర్జున్ ప్లాన్ చేసుకున్నాడు. ఆ విషయంలో ఎక్కడా రాజీపడొద్దని సుకుమార్‌కి కూడా చెప్పాడట.
అల్లు అర్జున్, సుకుమార్‌ల కలయికలో `పుష్ప` చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీమేకర్స్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. విలన్ క్యారెక్టర్ కోసం తమిళ హీరో విజయ్ సేతుపతిని ఫిక్స్ చేసుకున్నారు. అయితే ఈ చిత్రాన్ని తమిళంలో రిలీజ్ చేస్తాం అన్నప్పుడే అసలు సమస్య మొదలైంది.
సినిమాకు పారితోషికం కింద 10 కోట్లు ఇవ్వాలి. కానీ తమిళంలో మాత్రం `పుష్ప`ని రిలీజ్ చేయకూడదు.. ఈ కండీషన్లకి ఒప్పుకుంటేనే విలన్‌గా నటించడానికి రెడీ అని విజయ్ సేతుపతి కండీషన్ పెట్టాడట. అది చిత్ర యూనిట్‌కి, ముఖ్యంగా అల్లు అర్జున్‌కి నచ్చలేదు. దీంతో విజయ్ సేతుపతిని హోల్డ్‌లో పెట్టి మెయిన్ విలన్‌గా బాలీవుడ్ హీరో సునీల్ శెట్టిని ట్రై చేయడం మొదలుపెట్టారట. అక్కడ కన్ఫమ్ అయితే విజయ్ సేతుపతి పక్కన పెట్టేస్తారట.