‘వాల్మీకి’ ఈవెంట్ హంగామా స్టార్టైంది
వరుణ్‌తేజ్ హీరోగా 14 రీల్స్ ప్లస్ పతాకంపై డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న భారీ చిత్రం ‘వాల్మీకి’. ఈ నెల 20 వ తేదీన విడుదల కానున్న ఈ చిత్రం ప్రమోషన్స్ జోరు పెంచింది. అందులో భాగంగానే ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ని 15 వ తేదీన ప్లాన్ చేసారు. ఆ ఈవెంట్ ఎక్కడ జరిగేది, గెస్ట్ లు ఎవరు రాబోతున్నారు అనే విషయాలపై ప్రకటన రానుంది.
ఈ సినిమాని తమిళ బ్లాక్ బస్టర్ జిగర్తాండకు రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు. నేటివిటీని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా స్క్రిప్టును తెలుగైజ్ చేశారట. జిగర్తాండ తమిళ వెర్షన్ కి `పిజ్జా` ఫేం కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించారు. ఈ సినిమా లో సిద్ధార్థ్, బాబీసింహా హీరోలుగా నటించారు. 2014లో వచ్చిన హిట్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. వైవిధ్యభరితమైన చిత్రంగా ఈ సినిమాగా ప్రశంసలు అందుకుంది.
ఈ సినిమాలో కథ ప్రకారం …ఓ దుర్మార్గుడైన రౌడీ షీటర్ లో ఓ సినీ దర్శకుడి వల్ల మార్పు వస్తుంది. వాల్మికి కథ కూడా అంతే. ఒక దొంగలోని పరివర్తన అన్నది వాల్మీకి కథ. అందుకే వాల్మికిని గుర్తు చేసేందుకు ఈ కథ కు ఈ టైటిల్ పెట్టారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: అయనంకా బోస్, కథ: కార్తీక్ సుబ్బరాజ్, స్క్రీన్‌ప్లే: మధు, చైతన్య, ఆర్ట్: అవినాష్ కొల్ల, ఎడిటింగ్: ఛోటా కె.ప్రసాద్, ఫైట్స్: రామ్‌లక్ష్మణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరీష్ కట్టా, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీ ఆచంట, మాటలు-దర్శకత్వం: హరీష్ శంకర్.