Home Tollywood ‘వాల్మీకి’కు నో బజ్ కారణం ఇదే?

‘వాల్మీకి’కు నో బజ్ కారణం ఇదే?

బ్రో… ‘వాల్మీకి’కు బజ్ ఏది

విభిన్నమైన కథలను ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతున్న యంగ్ హీరో వరుణ్‌తేజ్‌. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో ఆయన కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘వాల్మీకి’. పూజా హెగ్డే హీరోయిన్ గా తమిళ నటుడు అధ్వర కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అయ్యింది. మరో రెండు రోజుల్లో సినిమా విడుదల అవుతోంది. అయితే చిత్రంగా ఈ సినిమాకు ఇప్పటిదాకా క్రేజ్ క్రియేట్ కాలేదు. అందుకు కారణం ఈ సినిమా తెలుగులో వచ్చి వెళ్లిపోయిన సిద్దార్ద చిత్రానికి రీమేక్ కావటమే అంటున్నారు.

అలాగే ఈ సినిమాలో కీలకమైన పాత్ర చేస్తున్న అధ్వర ఇక్కడ ఎవరూ తెలియకపోవటమే అని చెప్తున్నారు. కేవలం వరుణ్ తేజ్ క్రేజ్ తో ముందుకు వెళ్లాలి. ఇంతకాలం సాఫ్ట్ గా సాగిపోతున్న వరుణ్ తేజ కెరీర్ ఈ సినిమాతో కాస్త మాస్ గా టర్న్ తిరిగింది. దాంతో ఆయన్ని ఆదరిస్తున్న ఫ్యామిలీ ప్రేక్షకులు సినిమా హిట్టయ్యాక చూద్దాంలో అన్నట్లు గా ఉండిపోయారు. మెగా ఫ్యాన్స్ ఈ సినిమాకు ఏ స్దాయిలో సపోర్ట్ చేస్తారు అనేది వేచి చూడాల్సిన అంశం. దానికి తోడు పూజా హెగ్డే కూడా సినిమాలో మెయిన్ హీరొయిన్ కాకపోవడం, తనది క్యామియో లాంటి పాత్రేనని డైరక్టరే చెప్పడం నిరుత్సాహానికి గురి చేసే అంశం.

ఇప్పటికే వరుణ్‌ మాస్‌లుక్‌తో ఉన్న పోస్టర్లు టీజర్లు ఆకట్టుకోగా, ఇప్పుడు మరో సరికొత్త గెటప్‌తో ఉన్న పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంటూ వరుణ్‌తేజ్‌ పాత్రను పరిచయం చేసింది. ఇందులో వరుణ్‌తేజ్‌ ఘని.. అలియాస్‌ గద్దలకొండ గణేశ్‌ పాత్రలో కనిపించనున్నాడు. 80ల కాలం నాటి దుస్తుల ధరించి, పెద్ద కళ్లద్దాలు, చేతిలో సిగరెట్‌తో వరుణ్‌ స్టైల్‌గా నిలబడిన ఫొటో అభిమానులను ఆకట్టుకుంటోంది. మరి వెండితెరపై వరుణ్‌ ఎలా అలరిస్తారో చూడాలి.

14రీల్స్‌ ప్లస్‌పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. తమిళంలో ఘన విజయం సాధించిన ‘జిగర్తాండ’ రీమేక్‌గా ‘వాల్మీకి’తెరకెక్కుతోంది.

- Advertisement -

Related Posts

అదృష్టం కొద్దీ అభిజిత్ గెలిచాడట.. మంట పెట్టేసిన మోనాల్

బిగ్ బాస్ షోలో ఉన్నంత వరకు ఒకరకమైన మోనాల్‌ను చూస్తే.. బయటకు వచ్చాక మరో రకమైన మోనాల్‌ను చూస్తున్నట్టుంది. బయటకు వచ్చాక తన పరిస్థితి తాను ఏ స్థానంలో ఉందో తెలుసుకుంది. తన...

కులం పేరుతో పిలిచిన నిర్మాత.. స్టేజ్ మీదే కరెక్ట్ చేయించిన జగపతిబాబు

జగపతి బాబు కులానికి వ్యతిరేకమన్న సంగతి అందరికీ తెలిసిందే. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కూడా కులాల గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ఇండస్ట్రీలోనూ కుల భావన ఉంది గానీ తనకు మాత్రం అలాంటి...

ఎంత క్యూట్‌గా ఉన్నాడో.. ముంబైకి బయల్దేరిన మహేష్ బాబు

మహేష్ బాబు ఫోటోలు ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. మంచు విష్ణు భార్య వెరానిక బర్త్ డే సందర్భంగా మహేష్ బాబు తన ఫ్యామిలీతో సహా ఆ పార్టీలో...

రౌడీ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ …”లైగ‌ర్” విజయ్ ఫ‌స్ట్ లుక్ విడుదల

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ రంగంలోకి దిగేసాడు. ఇస్మార్ట్ శంకర్ లాంటి భారీ హిట్ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ పవర్‌ఫుల్‌ యాక్షన్‌, లవ్‌ ఎంటర్‌టైనర్‌...

Latest News