ర‌ష్మిక ప‌ద‌హారు సినిమాలు రిజెక్ట్ చేసిందా?

Rashmika Mandanna

`ఛ‌లో` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది క‌న్న‌డ భామ ర‌ష్మిక మంద‌న్న‌. తొలి చిత్రం విజ‌యం సాధించ‌డంతో క్రేజీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ఈ రెండేళ్ల కాలంలో వ‌రుస క్రేజీ చిత్రాల్లో న‌టించింది. ఇంత త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ హీరోల ప‌క్క‌న న‌టిస్తూ స్టార్ హీరోయిన్ స్టేట‌స్‌ని ఎంజాయ్ చేస్తోంది. ఇటీవ‌ల మ‌హేష్ న‌టించిన `స‌రిలేరు నీకెవ్వ‌రు`తో స్టార్ లీగ్‌లో చేరిపోయింది. ప్ర‌స్తుతం నితిన్‌తో `భీష్మ‌`. చిత్రంలో న‌టిస్తోంది. ఈ చిత్రం ఈ నెల 21న రిలీజ్ కాబోతోంది.

త్వ‌ర‌లో అల్లు అర్జున్ – సుకుమార్‌ల సినిమాలోనూ క‌నిపించ‌బోతోంది. ఈ చిత్రం కోసం మార్చి నుంచి డేట్స్ కేటాయించింద‌ట‌. ఇక త‌మిళంలో కార్తి న‌టిస్తున్న `సుల్తాన్‌` సినిమాతో ఎంట్రీ ఇస్తోంది. ఇంత త‌క్కువ స‌మ‌యంలోనే క్రేజీ ఆఫ‌ర్ల‌ని ఎలా సొంతం చేసుకుంటున్నార‌ని, ఆ సీక్రెట్ ఏంట‌ని ప్ర‌శ్నిస్తే మాత్రం ఎంతో శ్ర‌మిస్తే కానీ ఇలాంటి క్రేజ్ ద‌క్క‌దు. ఆఫ‌ర్లు ఊరికే రావు క‌దా అని సెల‌విచ్చింది. ఈ ప్రాజెస్‌లో దాదాపు 16 సినిమాల్ని రిజెక్ట్ చేశాన‌ని, వాటి వివ‌రాలని మాత్రం చెప్ప‌లేన‌ని స్ప‌ష్టం చేయ‌డంతో అంతా అవాక్క‌వుతున్నారు.