రెండో పెళ్లికి నిర్మాత దిల్ రాజు రెడీ?

దిల్‌రాజు.. నైజాం డిస్ట్రిబ్యూష‌న్ రంగంలో తిరుగులేని రారాజు. ఆటో మోబైల్ రంగం నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. న‌టుడు కాస్ట్యూమ్స్ కృష్ణ స‌హ‌కారంతో డిస్ట్రిబ్యూట‌ర్‌గా నిల‌దొక్కుకున్న దిల్ రాజు ఉరాఫ్ వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి `దిల్‌` సినిమాతో దిల్ రాజుగా మారిపోయారు. తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఇప్పుడు ఆయ‌న తెలియ‌ని వారులేరు. బిగ్ స్టార్స్ ద‌గ్గ‌రి నుంచి అప్ క‌మింగ్ హీరోలు, హీరోయిన్‌లు అత‌ని బ్యాన‌ర్‌లో న‌టించాల‌ని భావిస్తుంటారు.

దిల్ రాజు 17 ఏళ్ల సినీ జీవితంలో ఆయన భార్య అనిత‌ పేరు స‌మ‌ర్ప‌కురాలిగా క‌నిపించని సినిమా లేదు. భార్య అంటే ఆయ‌న‌కు అంత ఇష్టం. అయితే గ‌త రెండేళ్ల క్రితం దిల్ రాజు భార్య హార్ట్ ఎటాక్ వ‌ల్ల చ‌నిపోయారు. అప్ప‌టి నుంచి కొంత నైరాశ్యంలోనే వుంటూ వ‌చ్చిన దిల్ రాజు ఆ జ్ఞాప‌కాల నుంచి బ‌య‌టికి రావ‌డానికి వ‌రుస సినిమాలు నిర్మిస్తూ బిజీ అయిపోయారు. బాలీవుడ్‌లో `ఎఫ్‌2తో పాటు జెర్సీ రీమేక్‌కు ఓ భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

అయితే గ‌త కొన్ని నెల‌లుగా దిల్ రాజు కుటుంబ స‌భ్యులు మ‌ళ్లీ పెళ్లి చేసుకోమ‌ని నిత్యం ఇడ్డంది పెడుతున్నార‌ట‌. వారి కోరిక‌ని కాద‌లేక రీసెంట్‌గానే దిల్ రాజు పెళ్లికి సిద్ధ‌మ‌నే సంకేతాల్ని ఇచ్చిన‌ట్టు ఫిల్మ్ స‌ర్కిల్స్ లో వినిపిస్తోంది. అయితే ఇది ఎంత వ‌ర‌కు నిజం అన్న‌ది మాత్రం స్వ‌యంగా దిల్ రాజు చెబితే గానీ స్ప‌ష్ట‌త రాదు.