రామ్ మ‌ళ్లీ జోన‌ర్ మార్చేశాడు!

`ఇస్మార్ట్ శంక‌ర్‌` చిత్రం రామ్ కెరీర్‌ని మ‌లుపు తిప్పింది. అప్ప‌టి వ‌ర‌కు రామ్ కెరీర్‌లో హిట్‌లు వున్నా బ్లాక్ బ‌స్ట‌ర్ మాత్రం లేదు. ఆ లోటుని తీర్చిన సినిమా ఇది. రామ్‌లోని ఊర‌మాస్ కోణాన్ని ఈ సినిమాతో ద‌ర్శ‌కుడు పూరిజ‌గ‌న్నాథ్ అద్భుతంగా ఆవిష్క‌రించి రామ్‌కు ఈ సినిమాతో ఇస్మార్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని అందించాడు.

ఈ సినిమా త‌రువాత రామ్ నెక్ట్స్ లెవెల్ సినిమాల‌పై దృష్టిపెట్టాడు. త‌ను చేస్తున్న సినిమాలు హీరోగా త‌న స్థాయిని పెంచేవిగా వుండాల‌ని అందుకు త‌గ్గ‌ట్టుగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్ర‌స్తుతం రామ్ న‌టిస్తున్న చిత్రం `రెడ్‌`. ఇదొక థ్రిల్ల‌ర్. త‌మిళ హిట్ చిత్రం `త‌డ‌మ్‌` ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది.

కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌కుడు. స్ర‌వంతి మూవీస్ బ్యానర్‌పై స్ర‌వంతి ర‌వికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఏప్రిల్ 9న రిలీజ్ ప్లాన్ చేశారు. క‌రోనా ఎఫెక్ట్ కార‌ణంగా అది మారేలా వుంది. వ‌రుస సీరియ‌స్ సినిమాల త‌రువాత రామ్ దృష్టి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌పై ప‌డింది.

ఇటీవ‌ల సాయిధ‌ర‌మ్‌తేజ్‌కు `ప్ర‌తిరోజు పండ‌గే` చిత్రంతో సూప‌ర్‌హిట్‌ని అందించిన మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రామ్ ఓ సినిమాకు కమిట్ అయ్యాడు. ఇది ప‌క్కా ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ అని తెలిసింది.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles