తమిళ హీరో సూర్య మార్కెట్ తెలుగులో పూర్తిగా పడిపోయింది. సూర్య తిరిగి తన సినిమాలకు పూర్వ వైభవం తీసుకురావాలని విశ్వప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో అతను తెలుగులో ఒక స్ట్రెయిట్ చిత్రం చేసే అవకాశం ఉంది. వివరాల్లోకి వెళ్తే.
ఆ మధ్య మోహన్ బాబు- సూర్య ఒకరి క్రమశిక్షణ గురించి ఒకరు సోషల్ మీడియా సాక్షిగా తెగ పొగిడేసుకున్నారు. దాంతో మోహన్ బాబు చొరవ తీసుకుని ‘బందోబస్త్’ ప్లాప్ అయ్యాక తానె స్వయంగా ఒక దర్శకుడిని తీసుకువెళ్లి సూర్య కి కధ వినిపించాడు. సూర్య కి కూడా నచ్చింది. మొత్తం స్క్రిప్ట్ సిద్ధం చేసి మళ్ళీ సూర్యను కలవనున్నారు సదరు దర్శకుడు. అది కూడా సరే అనుకుంటే మోహన్ బాబు బ్యానర్ లోనే ఉండవచ్చు.