కరోనా పుణ్యమా అని ఏ పనీ చేయని వారు కూడా ఈ మధ్య పని చేయడం మొదలుపెట్టారు. ఏదీ చేయకూడదనుకున్నారో అదే హ్యాపీగా చేసేస్తున్నారు. కొంత మంది హీరోయిన్లు వర్కవుట్ల పేరుతో పని పనిచేసే పనుల్ని కూడా చేస్తూ వర్కవుట్లు చేస్తున్నారు. కొంత మంది పిల్లలతో గడిపేస్తున్నారు. కొంత మందేమో తమలో దాగివున్న కళల్ని బయటికి తీస్తున్నారు.
పెయింటింగ్‌లు వేస్తున్నారు. కొంత మంది స్క్రిప్ట్‌లు రాస్తున్నారు. కొంత మంది డ్యాన్సులు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. మెగా హీరో రామ్‌చరణ్ మాత్రం తన శ్రీమతి కోసం కొత్త అవతారం ఎత్తారు. కొత్తగా కుక్‌గా మారిపోయారు. మారిపోవడమే కాదు తన శ్రీమతి ఉపాసన కోసం వంట కూడా చేయడం పలువురిని ఆకట్టుకుంటోంది.
లాక్డౌన్ పొడిగించడంతో రామ్‌చరణ్ ఇంటి పట్టునే వుంటూ శ్రీమతి దగ్గర మార్కులు కొట్టేస్తున్నారు. రామ్‌చరణ్ వంట చేస్తున్న ఓ వీడియోని ఉపాసన షేర్ చేయడమే కాకుండా తన భర్త లాగే మిగతా వారి భర్తలు కూడా వారి భార్యల కోసం వంట చేయండని సలహా ఇవ్వడం విశేషం.
When @AlwaysRamCharan cooks dinner for the Mrs. 💕❤️
To all the husbands out there – he cooked dinner & also cleaned up after. Now that’s what makes him my hero ! 😉💕 pic.twitter.com/HOK8N1B7vc— Upasana Konidela (@upasanakonidela) April 15, 2020