మాస్ కు కేరాఫ్ ఎడ్రస్ చెప్పిన డైరక్టర్ తో రామ్ నెక్ట్స్

మరో మాస్ డైరక్టర్ తో రామ్ నెక్ట్స్ ఖరారు

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ ఎంటర్‌టైనర్ ఇస్మార్ట్ శంకర్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. రామ్ హీరోగా నటించిన ఈ చిత్రం అద్భుతమైన కలెక్షన్లు సాధించి దూసుకుపోయింది. ఈ నేపధ్యంలో రామ్ తదుపరి చిత్రం ఏ దర్శకుడుతో చేయబోతున్నారనేది హాట్ టాపిక్ గా మారింది.

అయితే రామ్ గత కొద్దిరోజులుగా ఏ సినిమా చేయాలి..ఏ దర్శకుడుతో ముందుకు వెళ్లాలి..మాస్ సినిమాలే కంటిన్యూ చేయాలా అనే సందేహాలతో ఉన్నారట. అయితే చివరకు ఓ కంక్లూజన్ కు వచ్చారట. ఆయన తన తదుపరి చిత్రానికి ఓ మాస్ డైరక్టర్ ని ఎంచుకున్నారు. ఆయన మరెవరో కాదు వివి వినాయిక్.

లవ్ స్టోరీతో కూడిన మాస్, యాక్షన్ ఉండేలా కథని ఈ సినిమా కోసం సెలెక్ట్ చేసుకుంటున్నారట. ఈ కథ విని వివి వినాయక్ సినిమాకు ఓకే చెప్పారట. కేవలం ప్రేమ కథతో వచ్చిన మరో దర్శకుడుకి వద్దని చెప్పేసినట్లు తెలుస్తోంది. ఈ డైరెక్టర్ గతంలో రామ్‌కు మంచి హిట్ ఇచ్చిన సరే… మాస్ కథతోనే తన వద్దకు రావాలని చెప్పారట.

అలాగే వివి వినాయక్ మాస్ కథతో రావడంతో రామ్ వెంటనే ఓకే చేసేసాడట. సాయి థరమ్ తేజ తో చేసిన ‘ఇంటెలిజెన్స్’ సినిమాతో డిజాస్టర్ రిజల్ట్ తెచ్చుకుని పూర్తిగా వెనకబడ్డ వినాయక్.. రామ్ సినిమాతోనైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారట. అయితే ఇమ్మీడియట్ గా రామ్-వినాయక్ ప్రాజెక్టు పెట్టాలెక్కుతుందో లేదో చూడాలి.