అక్కినేని వారి కుటుంబం లోని వారందరూ భాగస్వాములైన ‘మనం’ సినిమా ఎంత విజయం సాధించింది మనకు తెలుసు. ఆ సినిమాని ఆ కుటుంబమూ, ప్రేక్షకులూ కూడా మర్చిపోలేని ప్రత్యేకతలు ఆ సినిమాకి ఉన్నాయి. సరిగ్గా తెర పై అలాంటి ఇంద్రజాలమే చేయాలనుకుంటున్నాని చెప్పాడు సీనియర్ హీరో రాజశేఖర్. తన ఇద్దరు పిల్లలు – శివాని, శివాత్మిక, భార్య జీవితతో కలిసి ఒక సినిమా అనుకుంటున్నానని బయట పెట్టాడు. అయితే ప్రస్తుతం స్క్రిప్ట్ మీద పని జరుగుతోందని, నిర్మాత సి. కళ్యాణ్ ఈ సినిమా నిర్మించనున్నారని చెప్పారు రాజశేఖర్. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రారంభం అవుతుంది.
ప్రస్తుతం రాజశేఖర్, తానూ నటించిన ‘కల్కి’ సినిమా ప్రమోషన్స్ లో తీరిక లేకుండా ఉన్నారు.
మరో ‘మనం’ తో మన ముందుకు రాజశేఖర్
