మరో కొత్త రికార్డుతో ప్రియా వారియర్ సెన్సేషన్

రాత్రికి రాత్రే ఒక ట్రైలర్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది మలయాళీ కుట్టి ప్రియా ప్రకాష్ వారియర్. తన ఎక్స్ప్రెషన్స్ తో కుర్రకారు మతుల్ని పోగొట్టింది. అబ్బాయిల కలలరాణిగా మారిపోయింది. ‘ఒరు అదార్ లవ్ స్టోరీ’ ట్రైలర్ తో దేశమంతటా పాపులర్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. గత శుక్రవారం తను యాక్ట్ చేసిన ఒక కమర్షియల్ యాడ్ కి కోటి రూపాయల వరకు ముట్టినట్టు సమాచారం.

బ్రాండ్ ఎక్స్ పర్ట్ మాట్లాడుతూ బ్రాండ్ ఎండోర్స్ చేయటానికి ఆమెకు కోటి రూపాయల పారితోషకాన్ని ఇచ్చాము. ఇది కొత్తగా వచ్చేవారికి చాల ఎక్కువ అమౌంట్ అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. మరి దీనితో అమ్మడు కొత్త రికార్డు సృష్టించినట్టే కదా. అంతే కాదు త్వరలోనే ప్రియా వారియర్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది అని వార్తలు వస్తున్నాయి. ఆమధ్య ఈ నటి ర‌ణ్‌బీర్‌ కపూర్ సరసన నటించనున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. ర‌ణ్‌బీర్‌ కి జోడీ కడుతుందో లేదో తెలియదు కానీ ప్రియా బాలీవుడ్ ఎంట్రీ మాత్రం పక్కా అంటున్నారు. అందుకోసం అడ్వాన్సు కూడా తీసుకుందని సమాచారం.