బిగ్ బాస్ సీజన్-4 కి ఓ వైపు రంగం సిద్ధమవుతోంది. ఈనెలఖరునుంచి మాటీవీలో ప్రసారం కాబోతుంది. ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్ లో సెట్స్ వేసి సర్వం సిద్దం చేసి పెట్టారు. హోస్ట్ గా కింగ్ నాగార్జున కన్ఫమ్ అయ్యారు. ఓ ప్రోమో కూడా రిలీజ్ చేసారు. ఇదంతా ఒకే! ఇంతకీ అసలు సంగతేంటి? అదే! ఇందులో కంటెస్టెంట్లు ఎవరు? అన్నది ఇప్పటివరకూ బయట ఎక్కడా ఫోకస్ కాలేదు. సోషల్ మీడియాలోనూ దీనిపై పెద్దగా చర్చసాగలేదు. జనాలంతా కరోనా భయంతో ఇళ్లకే పరిమితమవ్వడం తో నేరుగా గ్రూప్ డిస్కషన్స్ అనేవి ఎక్కడా జరగలేదు. సోషల్ మీడియాలోనూ వైరస్ సినిమాలు చూస్తూ బిజీ అవ్వడంతో బిగ్ బాస్-4ని పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు.
ఈ నేపథ్యంలో బిగ్ బాస్ -4 లో కంటెస్టెంట్లు వీళ్లేనంటూ కొంత మంది పేర్లు వైరల్ అవుతున్నాయి. వాళ్లెవరంటే? సింగర్ సునీత అనుకున్నారుట. కానీ ఆమెకు కరోనా వచ్చింది. కాబట్టి ఇప్పట్లో సునీత రాదు. ఇక సీజన్ -3 లో జంట కంటెస్టుంట్లు అయిన వరుణ్ సందేష్, వితిక షేరును సీజన్ -4కి ఎంపిక చేసినట్లు సమాచారం. ఇంకా కొరియోగ్రాఫర్ రఘుమాస్టర్- ఆయన భార్య సింగర్ ప్రణవి, యూట్యూబ్ స్టార్ జాహ్నవి అలియాస్ మహాతల్లి, ఆమె భర్త సుశాంత్ మరో జంటగా ఎంపికయ్యారుట. అలాగే హెచ్ ఎమ్ టీవీ లో జోర్డాన్ వార్తలు చదివే సుజాత, టిక్ స్టార్ అరియానా గ్లోరీ, డాన్సర్ మెహబూబ్ దిల్ సే, షార్ట్ మూవీ స్టార్ సాహైల్ రియాన్ కూడా ఎంపిక చేసారుట.
ఇంకా ఫేమస్ కరాటా కళ్యాణి, మాజీ యాంకర్ లాస్య, నటుడు నందు, సింగర్ నోయెల్ సేన్, యాంకర్ ప్రశాంతి, జబర్దస్త్ స్టార్స్ రాంప్రసాద్, నరేష్ ఇలా కొంత మంది పేర్లు వైరల్ అవుతున్నాయి. అయితే సీజన్ -3 లో పాల్గొన్న వరుణ్ సందేశ్, వితిక ల పేర్లు మళ్లీ వినిపించడం ఆసక్తికరంగా ఉంది. ఇరువురు సీజన్ -3 లో గేమ్ ని రక్తికట్టించడంలో కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే.