బాలీవుడ్ హీరోతో సానియా మిర్జా ఎఫైర్ గుట్టు ఇదీ!

బాలీవుడ్ హీరోతో సానియా మిర్జా ఎఫైర్ గుట్టు ఇదీ!

ఆఫ్ ద రికార్డ్ కొన్ని గుస‌గుస‌లు అంత‌కంత‌కు వేడెక్కిస్తుంటాయి. ఆ త‌ర‌హాలోనే బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ తో హైద‌రాబాదీ టెన్నిస్ దిగ్గ‌జం సానియా మీర్జా ఎఫైర్ క‌హానీ అటు బాలీవుడ్ స‌హా ఇటు తెలుగు ప‌రిశ్ర‌మ‌లోనూ హాట్ టాపిక్. బాలీవుడ్ హీరో షాహిద్ క‌పూర్ ప్ర‌స్తుత‌ ప్రోషెష‌నల్ కెరీర్ జెట్ స్పీడ్ లో ఉంది. తెలుగు రీమేక్ ల‌తోనే బ్లాక్ బ‌స్ట‌ర్లు కొట్టేస్తున్నాడు. క‌బీర్ సింగ్ స‌క్సెస్ తో బాలీవుడ్ లో షాహిద్ రేంజ్ అంత‌కంత‌కు పెరిగిపోయింది. ప్ర‌స్తుతం జెర్సీ రీమేక్ లో న‌టిస్తున్నాడు. తెలుగులో విజ‌యం అందుకున్న ఈ సినిమా అక్క‌డా సంచ‌ల‌నమ‌వుతుంద‌ని అంచ‌నాలేర్ప‌డ్డాయి.

అయితే షాహిద్ లో ఇదంతా ఒక కోణం మాత్ర‌మే. మ‌రో కోణంలో ఈ హీరో ప్రేమాయ‌ణాలు సాగించ‌డంలో రికార్డ్ ఉంద‌న్న టాక్ కూడా ఉంది. కెరీర్ ఆరంభంలోనే హీరోయిన్ల‌తో ఎఫైర్లు న‌డిపించిన షాహిద్.. సీనియ‌ర్ అయిన‌ స‌ల్మాన్ ఖాన్ కి ఏ మాత్రం త‌క్కువ కాద‌ని ప్రూవ్ చేశాడు. ప‌లువురు సీనియ‌ర్ హీరోయిన్ల నుంచి జూనియ‌ర్ భామ‌ల వ‌ర‌కూ షాహిద్ చాలా మందితోనే డేటింగ్ లు చేశాడు. క‌రీనా క‌పూర్, మీరా రాజ్ పూత్, సోనాక్షి సిన్హా, అనుష్క శ‌ర్మ‌, ప్రియాకం చోప్రా, విద్యాబాల‌న్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఇలా పెద్ద జాబితానే ఉంది. ఎఫైర్ల పేరుతో బాలీవుడ్ మీడియా మాత్రం షాహిద్ ను రొమాంటిక్ గయ్ బాగా పాపుల‌ర్ చేసింది. అలాగే హైద‌రాబాద్ టెన్నీస్ ప్లేయ‌ర్ సానియా మిర్జాతోనూ ఎఫైర్ న‌డిపిన‌ట్లు అప్ప‌ట్లో క‌థ‌నాలు వేడెక్కించాయి. ఆ ఇద్దరూ ప్ర‌యివేటు ప్లేస్ లో క‌లుసుకున్న‌ప్ప‌టి ఫోటోలు..చాటు మాటు వ్య‌వహారాలు అప్ప‌ట్లో క్రీడా అభిమానుల్లో పెద్ద చ‌ర్చ‌గానే సాగింది. అప్ప‌ట్లో కాఫీ విత్ క‌ర‌ణ్ షో లో సానియా తో ఎఫైర్ విష‌య‌మై క‌ర‌ణ్ నిగ్గు తేల్చే ప్ర‌య‌త్నం చేసాడు. సానియా స్నేహితురాలా? ప‌్రియురాలా? అని షాహిద్ ని ప్ర‌శ్నించ‌గా జ‌స్ట్ ప్రెండ్ మాత్ర‌మేనని స‌రిపెట్టాడు. అలాగ‌ని క‌ర‌ణ్ షాహిద్ ని వ‌దిలేసాడా అంటే.. షాహిద్ ని ప‌దే ప‌దే అదే ఆ ఎఫైర్ రిలేటెడ్ ప్ర‌శ్న‌ల‌తో చివ‌రికి మెట్టు దిగేలా చేసాడు. “సానియా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంది“ అని షాహిద్ ఏదో అన‌బోతే.. “అందుకే బంతి మీ కోర్టులో లేద‌న్న మాట!!“ అని క‌రణ్ క‌ట్ చేశాడు.

అందుకు షాహిద్ లేదు. నా కోర్టులో నే ఉంది. కానీ ఎప్పుడూ మైదానంలోకి వెళ్ల‌లేద‌ని జోకులు వేయ‌డం చ‌ర్చ‌కొచ్చింది. ఆ ప‌క్క‌నే ఉన్న ప్రియాంక చోప్రా వెంట‌నే ప‌గ‌ల‌బ‌డి న‌వ్వింది. అయితే సానియా మీకు మంచి స్నేహితురాలా? ఆమెను మీరు స్నేహితురాలిగా అంగీక‌రిస్తారా? అంటే అవున‌న్నాడు షాహిద్. ఒక‌రికొక‌రు బాగా తెలుసు… “అంటే స్నేహం లేదా?“ అని ఒకానొక సంద‌ర్భంలో క‌ర‌ణ్ గుచ్చి గుచ్చి అడిగాడు‌. చివ‌రికి త‌ట‌ప‌టాయించిన షాహిద్ స్నేహం కాదు. కొన్నాళ్ల పాటు స‌న్నిహితంగా మెలిగామ‌ని గుట్టు విప్పాడు. గ‌తంలో పర్హాన్ అక్త‌ర్..సానియా మీర్జా క‌ర‌ణ్ షో లో పాల్గొన్న‌ప్పుడు సానియాను ఇలాగే ప్ర‌శ్నించాడు. అప్పుడు సానియా ఇది చాలా కాలం క్రితం విష‌యం. నాకు స‌రిగ్గా గుర్తు లేదంటూ ఎస్కేప్ అయింది. ప్ర‌స్తుతం సానియా పాకిస్తాన్ క్రికెట‌ర్ షోయ‌బ్ మాలిక్ ని పెళ్లి చేసుకుని దుబాయ్ లో స్థిర‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే ఓ బిడ్డ‌కు మాతృమూర్తి అయ్యింది. సానియా ఎఫైర్ మ్యాట‌ర్స్ .. అలాగే సోయ‌బ్ తో విడాకులు అంటూ సాగించిన ప్ర‌చారంపై హైద‌రాబాదీల్లో నిరంత‌రం చ‌ర్చ సాగుతూనే ఉంటుంది.