బాబోయ్…’సైరా’ బాదుడు

సైరా టిక్కెట్ రేటు పెంచేసారు

పెద్ద సినిమాల రిలీజ్ టైమ్ లో టిక్కెట్ రేట్లు పెంచటం అనేది చాలా కామన్ గా మారిపోయిన విషయం తెలిసిందే. మొన్న సాహో సినమాకు సైతం భారీగా పెంచారు. ఇప్పుడు సైరా సినిమా టీమ్ సైతం టిక్కెట్ రేట్లు పెంపులో బిజీగా ఉందని సమాచారం. మరీ ముఖ్యంగా చిరంజీవి కు క్రేజ్ ఎక్కువ ఉన్న నైజాంలో ఈ రేట్లు పెంపు మరీ ఎక్కువగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్ బుక్కింగ్ లు నైజాంలో మొదలైపోయాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం పెంచిన రేట్లు ప్రకారం టిక్కెట్ రేట్లు వసూలు చేస్తున్నారు.

నిర్మాత రామ్ చరణ్… తెలుగు రాష్ట్రాల్లో తొలి వారం టిక్కెట్టు పెంపునకు అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.
అయితే తెలంగాణలో టిక్కెట్ల రేట్లు పెంచవద్దని ప్రభుత్వం సీరియస్‌గా వార్నింగ్ ఇవ్వడంతో టీమ్ కొంత టెన్షన్ గానే ఉంది. అయితే సినిమా బడ్జెట్ బాగా పెట్టిన నేపథ్యంలో టిక్కెట్ల రేట్లు పెంచేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు వినతులు వెళుతున్నట్టు తెలుస్తోంది. చిరంజీవికి రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలతోనూ సాన్నిహిత్యం ఉంది.

అదే విధంగా `సైరా` అమెరికాలోనూ అత్యంత భారీగా రిలీజవుతోంది. అక్కడ ఇప్పటికే టిక్కెట్ల ధరల్ని ఫిక్స్ చేశారు. ఒక్కో టిక్కెట్టుకి పెద్దలకు 28 డాలర్లు.. పిల్లలకు 18 డాలర్లు ఫిక్స్ చేశారు. అలా కాకుండా మామూలు సాధాసీదా స్క్రీన్లకు అయితే పెద్దలకు 25 డాలర్లు .. పిల్లలకు అయితే 15 డాలర్లు టిక్కెట్టు రేటు ఖరారు చేసారు.

ఇక ఈ సినిమా స్పెషల్ షోల విషయానికి వస్తే …తెలంగాణాలో ఫర్మిషన్ ఇస్తారా ఇవ్వరా అనేది పెద్ద క్వచ్చిన్ మార్క్ గా ఉంది. ఆంధ్రాలో అయితే ప్రతీ సినిమాకు ఇచ్చేస్తున్నారు కాబట్టి నో ప్లాబ్లం అంటున్నారు.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles