బన్నీ గ్రాండ్ పార్టీ .. మరి అనిల్ ఎక్కడ?

లేటెస్ట్ గా ఈ సంక్రాంతికి అల వైకుంఠపురంలో సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు అల్లు అర్జున్. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మొదట్లో డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ అదిరిపోయే ఆడియోతో మ్యూజికల్ హిట్ గా నిలిచి ఏకంగా 200 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఈ సినిమాతో ఊహించని విజయాన్ని సొంతంచేసుకున్న బన్నీ తన ఆనందాన్ని అందరితో షేర్ చేసుకోవాలని అనుకున్నాడు. ఆదివారం ఇండ‌స్ట్రీ పార్టీ అంటూ భారీ పార్టీని ఇచ్చాడు. టాలీవుడ్ లో క్రేజీ దర్శకుల నుండి లేటెస్ట్ గా వస్తున్న దర్శకుల వరకు అందరికి అదిరిపోయే పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీలో లెజెండరీ దర్శకుడు దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు మొదలుకొని, శ్రీను వైట్ల, పూరి జగన్నాద్, సుకుమార్, కోరుటాల శివ, సురేందర్ రెడ్డి, త్రివిక్రమ్, కరుణాకరన్, మారుతి, కళ్యాణ్ కృష్ణ కురసాల, విక్రమ్ కె కుమార్, ఇలా చాలా మంది దర్శకులు పాల్గొన్నారు.

ఇదంతా బాగానే ఉంది కానీ ఈ పార్టీ లో ఒక్క దర్శకుడి పేరు మాత్రం బాగా వినిపించింది. ఎందుకు ఆ దర్శకుడు ఈ పార్టీకి రాలేదు. కావాలనే పిలవలేదా? లేక ఆయనే కావాలని రాలేదా ? అన్న సందేహాలు అక్కడున్నవారిలో మొదలయ్యాయి. అంతగా ఆసక్తి రేపిన ఆ దర్శకుడు ఎవరోకాదు అనిల్ రావిపూడి. లేటెస్ట్‌గా సూపర్ స్టార్ మహేష్‌తో `సరిలేరు నీకెవ్వరూ` ,చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా బ‌న్నీ సినిమాతో సంక్రాంతి బ‌నిలో పోటీప‌డింది. అల్లు అర్జున్ `అల వైకుంఠపురంలో` సినిమాకు గట్టి పోటీగా నిలిచింది. రెండు సినిమాల అభిమానుల మధ్య చిన్ని పాటి యుద్ధ వాతావరణం ఏర్పడడం లాంటివే కాకుండా అటు కలక్షన్స్ పరంగా నాన్ బాహుబలి రికార్డ్స్ మావంటే మావంటూ పోటీ పడడం… బన్నీ కి మహేష్ కి మధ్య సంక్రాంతి పోటీ ఓ రేంజ్ లో సాగ‌డంతో కావాల‌నే అనిల్ ని పిలవలేదని టాక్ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల టాక్‌. అలాంట‌ప్పుడు బ‌న్నీ ఇచ్చింది ఇండ‌స్ట్రీ పార్టీ ఎలా అవుతుంద‌ని అంతా అంటున్నారు.