గత నాలుగైదు రోజుల క్రితం తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఇండస్ట్రీ దిగ్గజాలైన మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జునతో ప్రత్యేకంగా భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. ఏపీకి చిత్ర పరిశ్రమను తరలించాలని గత కొన్నిరోజులుగా డిమాండ్లు, వార్తలు హల్చల్ చేస్తున్న నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జునలతో తలసాని ప్రత్యేకంగా భేటీ కావడం సంచలనంగా మారింది. జూబ్లీహిల్స్‌లోని చిరు కొత్తగా నిర్మించుకున్న గృహంలో ఈ భేటీ జరగడం ప్రాధాన్యతను సంతరించుకుది.
ఈ భేటీలో తెలుగు చిత్ర పరిశ్రమకు పలు వరాలని ప్రకటించడం శంషాబాద్‌లో పూణే తరహా ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ నిర్మాణం, 24 క్రాఫ్ట్స్‌కు సంబంధించిన వారికి ఆ ఇనిస్టిట్యూట్‌లో ప్రత్యేక శిక్షణ ఇవ్వడం, దీనికితోడు జూబ్లీహిల్స్‌లో కల్చరల్ సెంటర్ కోసం రెండెకరాల స్థలం కేటాయించడం, చిత్రపురి కాలనీ పక్కన వున్న 10 ఎకరాల స్థాలన్ని సినీ కళాకారుల ఇళ్ల నిర్మాణం కోసం ఇచ్చేయడం, ఎఫ్డీసీ తరుపున టీవీ, సినీ కళాకారులకు గుర్తింపు కార్డుల పంపిణీ వంటి విషయాలు తొలి మీటింగ్‌లో చర్చించిన తలసాని తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్‌లో మెగాస్టార్ చిరు, నాగ్‌తో మళ్లీ సమావేశం కావడం కొత్త చర్చకు దారితీస్తోంది. ఇంతకీ ఈ వరుస భేటీలు ఎందుకు జరుగుతున్నాయి. వీటి వెనక ఏం జరుగుతోంది? అన్నది ఎవరికీ అంతు చిక్కడం లేదు.