ప‌వ‌న్ పీవీపీని మ‌ర్చిపోయారా?

రెండేళ్ల విరామం త‌రువాత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ వ‌రుస సినిమాలకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేస్తూ షాకుల మీద షాకులిస్తున్నారు. `అజ్ఞాత‌వాసి` త‌రువాత ఏపీ రాజ‌కీయాల్లో యాక్టీవ్ అయిపోయిన ప‌వ‌న్ రెండేళ్ల పాటు సినిమాల‌కు దూరంగా వుంటూ వ‌చ్చారు. తాజాగా ఏం జ‌రిగిందో ఏమో తెలియ‌దు కానీ ఉన్న‌ట్టుండి వ‌రుస చిత్రాల్ని ప్ర‌క‌టిస్తూ షాకుల మీద షాకులిస్తున్నారు. `పింక్‌` రీమేక్‌ని త‌న 26వ చిత్రంగా మొద‌లుపెట్టిన ప‌వ‌న్ ఆ వెంట‌నే మ‌రో చిత్రాన్ని తెర‌పైకి తీసుకొచ్చారు.

పీఎస్‌పీకే 27గా క్రిష్ చిత్రానికి ఓకే చెప్పేశారు. పిరియాడిక్ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాని జ‌న‌వ‌రి 29న లాంఛ‌నంగా పూజాకార్య‌క్ర‌మాల‌తో ప్రారంభించారు. ఇది పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్న సినిమా అని చెబుతున్నారు. దీనికి సంబంధించిన రెగ్యుల‌ర్ షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు కానీ సెట్స్ మాత్రం సిద్ధ‌మ‌వుతున్నాయి. ఇదిలా వుంటే తాజాగా 28వ చిత్రాన్ని హారీష్‌శంక‌ర్‌తో చేస్తున్న‌ట్టు అఫీషియ‌ల్ న్యూస్ ఇటీవ‌లే బ‌య‌టికి వ‌చ్చింది. మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు.

ఇవ‌న్నీ ఒక‌ప్పుడు ప‌వ‌న్ అడ్వాన్స్ తీసుకున్న సినిమాలు. ఇప్ప‌టికి సెట్స్‌మీద‌కి వెళుతున్నాయి. రేణూదేశాయ్‌కి భారీ మొత్తం ఇవ్వాల్సిన స‌మ‌యంలో ఈ సంస్థ‌ల‌న్నీ ప‌వ‌న్‌కు త‌లా 20 కోట్లు అడ్వాన్స్ రూపంలో ఇచ్చి సినిమా కోసం అగ్రిమెంట్ చేయించుకున్నాయి. ఇవ‌న్నీ బాగానే వున్నాయి కానీ ముందు ప‌వ‌న్‌కు అడ్వాన్స్ ఇచ్చిన పీవీపీ మాత్రం త‌న‌తో సినిమా చేయాల‌ని, చేయ‌మ‌ని గానీ ప్ర‌క‌టించ‌డం లేదు. ప‌వ‌న్ అత‌న్ని మ‌ర్చిపోయాడా? లేక అత‌ని సినిమా కూడా లైన్‌లో వుందా? అన్న‌ద మాత్రం ఇప్ప‌టికి స‌స్పెస్స్‌గానే వుంది.