జాన్.. ఈ పేరు చెప్పగానే ప్రభాస్ మూవీ కళ్లముందు కదలాడుతుంది. ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సినిమాకు వర్కింగ్ టైటిల్ ఇదే. క్లాప్ బోర్డ్ మీద కూడా ఇదే పేరు కనిపిస్తుంది. ఇప్పుడు దిల్ రాజు తన సినిమాకు ఈ టైటిల్ వాడేశాడు..
శర్వానంద్, సమంత హీరోహీరోయిన్లుగా దిల్ రాజు బ్యానర్ పై ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తమిళ్ లో కల్ట్ ప్రేమకథగా పేరు తెచ్చుకున్న 96 సినిమాకు రీమేక్ ఇది. ఈ మూవీకి జాను అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈరోజు అదే టైటిల్ తో పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. దీంతో ప్రభాస్ సినిమాకు ఇక జాన్ అనే టైటిల్ పెట్టరనే విషయం అర్థమైపోయింది.
ఈ టైటిల్ అనుకున్నప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరి కన్ను ఎందుకోగాని ఈ టైటిల్ మీదే పడింది. తమిళ చిత్రం ‘96’ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి ‘జాను’ అనే టైటిల్ పెట్టారు. ప్రేమ్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం వచ్చే నెలలో విడుదల కానుంది. మొత్తానికి ప్రభాస్ ఎంతో ఇష్టపడిన ‘జాన్’ టైటిల్‌ను దిల్ రాజు, శర్వానంద్‌ల కోరిక మేరకు ప్రభాస్ త్యాగం చేయడం ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది.