గత కొంత కాలంగా నయనతార, దర్శకుడు విగ్నేష్ శివన్ సహజీవనం చేస్తున్నారు. కోలీవుడ్‌లో ఏ సినిమా ఫంక్షన్ చూసినా ఈ జంటే, ఏ గుడికి వెళ్లినా ఈ జంటే దర్శనమిస్తోంది. అంతగా కలిసి తిరిగేస్తున్నారు. పెళ్లి మాట మాత్రం ఎత్తడం లేదు. కొంత మంది మాత్రం ఇప్పటికే సీక్రెట్ మ్యారేజ్ అయిపోయిందని కోలీవుడ్‌లో గత రెండేళ్లుగా ప్రచారం జరుగుతూనే వుంది.
తాజాగా తన ప్రియుడి కోసం నయనతార విలన్‌తో జతకట్టడానికి సిద్ధమైంది. `రంగం` సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన అజ్మల్ అమీర్ తో కలిసి నయనతార ఓ సినిమా చేస్తోంది. దీనికి నయన్ ప్రియుడు విగ్నేష్ శివన్ నిర్మాత. నేట్రిక్కన్` పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో నయనతార అంధురాలిగా ఛాలెంజింగ్ పాత్రలో కనిపించనుందట. ఈ చిత్రాన్ని కొరియన్ ఫిల్మ్ `బ్లైండ్` ఆధారంగా రూపొందిస్తున్నారు. చెన్నై పరిసరాల్లో చిత్రీకరణ జరుగుతోంది. మిలింద్ రావు దర్శకుడు. ఇప్పటికే 80 శాతం చిత్రీకరణ పూర్తయింది. కరోనా వైరస్ కారణంగా చిత్రీకరణ నిలిపివేశారు.