సినీ పరిశ్రమలో హీరోయిన్ పాత్ర చేసినా మరే పాత్ర చేసినా సరే, అన్నిటికంటే విజయమే ముఖ్యం. విజయ బాటలో ఉంటె ఎవరైనా పిలిచి మరీ అవకాశాలు ఇస్తారు లేదంటే ఎంత గొప్ప నటీనటులైనా దొరికిన పాత్రతో, ఇచ్చిన రెమ్యూనరేషన్ తో సర్దుకుపోవాల్సిందే.
అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కుతున్న సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ అని మనకు తెలిసిందే. ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో టబుని కూడా తీసుకున్నారట. చాలా ఏళ్ల తరువాత తెలుగు తెర పై టబు కనిపిస్తుంది.
ఈ సినిమా కోసం హీరోయిన్ పూజా హెగ్డే కంటే కూడా టబు కే ఎక్కువ ముట్టజెప్పారట. కారణం, ఆమె హిందీ లో వరుస హిట్ సినిమాల్లో నటించడమే. పైగా 40 ల్లో ఉన్నా ఆమె క్రేజ్ ఇక్కడ తగ్గకపోవడం కూడా కారణం కావచ్చు. చూడాలి మరి త్రివిక్రమ్ ఈ సారి ఎలాంటి పాత్ర టబు కి ఇచ్చాడో.