ప్రపంచం మొత్తం కరోనా వైరస్ కారణంగా భయంతో వణికిపోతుంటే ప్రభాస్ లాంటి వాళ్లు ప్రాణాలకు తెగించి సినిమా షూటింగ్‌ల కోసం దేశం కాని దేశం వెళ్లి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. మిగతా వాళ్లు షూటింగ్‌లని వాయిదా వేస్తున్నారు. అయితే బెల్లంకొండ సురేష్ మాత్రం తన కొడుకు సినిమా ఆపడానికి వీళ్లేదని కరాకండీగా చెప్పేశాడట.
బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న తాజా చిత్రం `అల్లుడు అదుర్స్`. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ని రిలీజ్ చేశారు మేకర్స్. తాజా షెడ్యూల్‌ని హైదరాబాద్‌లో ప్రారంభించాల్సి వుంది. అయితే కరోనా వైరస్ కారణంగా షూటింగ్లన్నింటిని రద్దు చేశారు. అయితే తన కొడుకు సినిమాని ఆపడానికి వీళ్లేదని నిర్మాత బెల్లంకొండ సురేష్ హుకుం జారీ చేశారట. ఇందులో హీరోయిన్గా నభా నటేష్ నటిస్తోంది. అయితే ఆమె ప్రస్తుతం బెంగళూరులో వుంది. వెంటనే హైదరాబాద్ రావాలని, షూటింగ్లో పాల్గొనాలని బెల్లంకొండ సురేష్ బెదిరించినట్టు వార్తలు వస్తున్నాయి.
బెల్లంకొండ శ్రీనివాస్ చిత్రాలకు బెల్లం కొండ సురేష్ షాడో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. డబ్బు తనదే అయినా పేరు మాత్రం బయటికి వేరే నిర్మాతది వుండటం ఈ మధ్య జరుగుతూనే వుంది. `అల్లుడు అరుర్స్`కి కూడా ప్రొడ్యూసర్ వేరే వ్యక్తి వున్నా తెర వెనక వుంది మాత్రం బెల్లంకొండ సురేషే అని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అందువల్లే బెల్లంకొండ సురేష్ ఆర్టిస్ట్‌లపై అజమాయిషీ చెలాయిస్తున్నారని, నభా నటేష్‌ని మందలించాడని చెబుతున్నారు.