నీళ్లు పంచుతున్న మంచు మనోజ్

నీళ్లు పంచడమేంటి అనుకుంటున్నారా. తాజాగా చెన్నై లో నీటికి తీవ్ర కటకట ఏర్పడిన సంగతి తెలిసిందే కదూ. అందువల్ల ఏ ఏ ప్రాంతాల్లో నీళ్లు అందడం లేదో, అక్కడి వారికి మంచు మనోజ్ తన బృందంతో కలిసి నీళ్లను సరఫరా చేస్తున్నారట. మంచిదే కదూ. ఒకప్పుడు చెన్నై కి వరదలు వచ్చినప్పుడు కూడా తన వంతు సాయం చేసాడు ఈ హీరో.

తాను పుట్టి పెరిగిన ఊరైన చెన్నై ఋణం ఈ విధంగా తీర్చుకుంటున్నాడన్న మాట.