నితిన్ సెటైర్ వేసింది ఆ హీరోపైనే!

వరుస ఫ్లాపుల తరువాత నితిన్ కు `భీష్మ`తో సాలీడ్ హిట్ లభించింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లోనూ వసూళ్లు పరంపరని కొనసాగిస్తోంది. వీకెండ్ తరువాత కూడా మండే రోజు మంచి వసూళ్లని రాబట్టి లాంగ్రన్ గ్యారంటీ అనే సంకేతాల్ని అందించింది. నితిన్‌కు పెళ్లికుదరడం.. ఆ సమయంలోనే ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న హిట్ `భీష్మ`తో దక్కడం శుభసూచకంగా భావిస్తూ సెలబ్రిటీలు నితిన్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

పొగడ్తల జడవానలో తడిసిముద్దవుతున్న`భీష్మ` టీమ్ మంగళవారం ఆసమ్ సక్సెస్ పేరుతో సక్సెస్‌మీట్‌ని నర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దిల్ రాజు నితిన్‌పై దర్శకుడు వెంకీ కుడుములపై ప్రశంసలు కురిపించారు. ఇదిలా వుంటే ఆ తరువాత మాట్లాడిన హీరో నితిన్ పరోక్షంగా ఓ హీరోపై సెటైర్లు వేయడం ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా రిలీజ్‌కు ముందు హీరో నాగశౌర్య దర్శకుడు వెంకీ కుడుములపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

మంగళవారం ఈ వ్యాఖ్యల్ని పరోక్షంగా గుర్తు చేసిన నితిన్ తన నటన గురించి అంతా అభినందిస్తున్నారని, ఈ సినిమా విజయంతో వెంకీ చాలా మందికి సమాధానం చెప్పాడని పరోక్షంగా నాగశౌర్యకు కౌంటర్ ఇవ్వడం చర్చకు దారితీస్తోంది.