గత ఏనిమిదేళ్లుగా హైదరాబాదీ అమ్మాయి షాలినితో ప్రేమలో వున్న యంగ్ హీరో నితిన్ ఇటీవలే ఇరు కుటుంబాల అంగీకారంతో ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పెళ్లి పనులు కూడా మొదలుపెట్టేశారు. పసుపు కొట్టే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏప్రిల్ 16న దుబాయ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్‌ని ప్లాన్ చేశారు. పెళ్లికి తీసుకెళ్లే గెస్ట్‌ల లిస్ట్‌ని కూడా ఫైనల్ చేశారు. వారికి టిక్కెట్లని కన్ఫమ్ చేసే పని కూడా మొదలుపెట్టారట.
అయితే నితిన్ డెస్టినేషన్ వెడ్డింగ్‌కి కరోనా బ్రేకులు వేస్తోంది. ప్రపంచాన్ని ప్రస్తుతం కరోనా వైరస్ గడగడలాడిస్తున్న విషయం తెలిసిందే. దీని కారణంగా సెలబ్రిటీలు విదేశాల్లో విహరించాలంటే జంకుతున్నారు. కీలక సినిమాల షూటింగ్స్ని వాయిదా వేసుకుంటున్నారు. ఈక్రమంలో దుబాయ్‌లో జరగనున్ననితిన్ పెళ్లి ప్రశ్నార్థకంలో పడింది. కరోనా కంట్రోల్ అయితే దుబాయ్‌లో.. లేదంటే హైదరాబాద్‌లో జరపాలని నితిన్ ఫాదర్ నిర్ణయించుకున్నారట.
దుబాయ్‌లో కరోనా కేసులు రోజు రోజుకి ఎక్కువవుతుండటంతో అక్కడి ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీంతో నితిన్ డెస్టినేషన్ వెడ్డింగ్‌కి భారీ అవి అడ్డంకిగా మారడంతో పరిస్థితులని బట్టి హైదరాబాద్‌లోనే వివాహాన్ని జరపాలని ఏర్పాట్లు చేస్తున్నారట. ఎంత పని చేసిందో కదూ కరోనా..