నాన్న‌కి ప‌ద్మ‌శ్రీ ఇవ్వాలి

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా శ్రీమ‌తి మ‌మ‌త స‌మ‌ర్ప‌ణ‌లో హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్‌, గీతాఆర్ట్స్ ప‌తాకాల‌పై స్టార్ డైరెక్టర్ త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర‌వింద్, ఎస్‌.రాధాకృష్ణ(చిన‌బాబు) నిర్మిస్తోన్న చిత్రం `అల వైకుంఠ‌పుర‌ములో`. ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందించిన ఈ సినిమా మ్యూజిక‌ల్ కాన్‌స‌ర్ట్ సోమ‌వారం హైద‌రాబాద్ యూసఫ్ గూడ్ పోలీస్ గ్రౌండ్స్‌లో అభిమానులు, సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో…

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ – ““ఎంట్రోయ్‌ గ్యాప్ ఇచ్చావ్‌.. ఇవ్వ‌లా వ‌చ్చింది“ ఇది డైలాగ్ కాదు, నా జీవితంలో జ‌రిగిన సంఘ‌ట‌నే. ఎందుకింత గ్యాప్ తీసుకున్నార‌ని అంద‌రూ అడిగారు. వారికి నేను చెప్పేది ఒక‌టి. నా మూడు చిత్రాలు సరైనోడు, డీజే, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అయిన త‌ర్వాత చాలా స‌ర‌దా సినిమా చేయాలి. ఈజ్ ఉండాలి. ఎన్ని క‌థ‌లు విన్నా న‌చ్చ‌లేదు. అలాంటి క‌థ సెట్ కావ‌డానికి త్రివిక్ర‌మ్‌గారు ఖాళీ అయ్యి.. సినిమా చేయడానికి ఇంత టైమ్ ప‌ట్టింది. అందుకే ఈ గ్యాప్. రిలీజ్‌లో గ్యాప్ ఉంటుందేమో కానీ.. సెల‌బ్రేష‌న్స్‌లో గ్యాప్ ఉండ‌దు. ఖాళీ ఉన్న రోజుల్లో మా ఆవిడ‌తో క‌లిసి మ్యూజిక్ బ్యాండ్ ప్రోగ్రామ్స్‌కు వెళ్లేవాడిని. ఇంటికొచ్చిన త‌ర్వాత ఈ మ్యూజిక్ బ్యాండ్స్ అంద‌రూ నా నెక్ట్స్ సినిమాలో ప్లే చేయాల‌ని అనుకునేవాడిని. ఆ విష‌యాన్ని మా ఆవిడ‌కు చెబితే.. అంత పాట ప‌డాలి క‌దా! అనేది. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. మ్యూజిక్ సిట్టింగ్స్ స‌మ‌యంలో ల‌వ్ సిట్యువేష‌న్ సాంగ్ వ‌చ్చిన‌ప్పుడు అంద‌రూ ఎలాంటి సాంగ్ ఉండాలనుకుంటున్నారని న‌న్ను అడిగారు. దానికి నేను అదేమో తెలియ‌దండి.. అంద‌రూ మ్యూజిక్ బ్యాండ్స్ వాళ్లు ఉండాలని అన్నాను. అంద‌రికీ పిచ్చెక్కి పోయే సాంగ్ కావాలని నేను అన‌గానే త‌మ‌న్ సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న సాంగ్‌ను వినిపించాడు. సిరివెన్నెల‌గారు, సిద్ శ్రీరామ్‌గారి వ‌ల్ల ఆ పాట స్థాయి ఎంతో పెరిగింది. సాంగ్ బాగా వ‌చ్చింద‌ని అనుకున్నాను కానీ.. ఈ పాట ఇంత సెన్సేష‌న్ అవుతుంద‌ని నేను క‌ల‌లో కూడా అనుకోలేదు. అంత గొప్ప పాట రాసిన సీతారామ‌శాస్త్రిగారు, పాడిన సిద్‌శ్రీరామ్‌కి, పాట కంపోజ్ చేసిన త‌మ‌న్‌కి, ఐడియా ఇచ్చిన త్రివిక్ర‌మ్ స‌హా పాట‌కు ప‌నిచేసిన టెక్నీషియ‌న్ అంద‌రికీ మ‌న‌స్ఫూర్తిగా థ్యాంక్స్‌. అలాగే ఈ సినిమాలో సాంగ్స్ రాసిన ప్ర‌తి ఒక లిరిక్ రైట‌ర్ అందరికీ థ్యాంక్స్‌.

త‌మ‌న్‌తో నాది హ్యాట్రిక్ ఆల్బ‌మ్‌. ఇర‌గ‌దీసే మ్యూజిక్ ఇచ్చాడు త‌మ‌న్‌. ఈ సినిమా సంగీతం వ‌ల్ల త‌న రేంజ్ మ‌రో రేంజ్‌కు వెళ్లింది. పి.ఎస్‌.వినోద్‌గారికి థ్యాంక్స్‌. చాలా అందంగా చూపించారు. ఆర్ట్ డైరెక్ట‌ర్ ప్ర‌కాశ్‌గారికి, ఎడిట‌ర్ న‌వీన్‌గారికి, డాన్స్ మాస్ట‌ర్స్‌కి, రామ్ ల‌క్ష్మ‌ణ్‌గారికి మ‌న‌స్ఫూర్తిగా థ్యాంక్స్‌. న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే ముర‌ళీశ‌ర్మ‌గారు అద్భుత‌మైన పాత్ర‌ను పోషించారు. మంచి క్యారెక్ట‌ర్ ప్లే చేశారు. జ‌యరాంగారు ఈ సినిమాలో చాలా మంచి పాత్ర చేశారు. అలాగే జేబీ అనే మ‌రో మ‌ల‌యాళ యాక్ట‌ర్ న‌టించారు. సునీల్‌, రాహుల్ రామ‌కృష్ణ‌కి థ్యాంక్స్‌. సుశాంత్‌కి స్పెష‌ల్‌గా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే త‌నొక హీరో. త‌ను చేసిన ఈ పాత్ర‌లో త‌ను చేస్తే బావుంటుంద‌ని భావించి అడ‌గ్గానే క‌థ కూడా విన‌లేదు. న‌మ్మి చేశాడు. త‌న‌కు స్పెష‌ల్ థ్యాంక్స్‌. పూజా హెగ్డేతో రెండోసారి న‌టించాను. చాలా అందంగా న‌టించింది. నివేదా పేతురాజ్‌.. చ‌క్క‌గా న‌టించింది. ట‌బుగారి గురించి చెప్పాలంటే.. ఆవిడ పెర్ఫామెన్స్‌కు నేను పెద్ద అభిమానిని. నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్‌. ఆమెతో క‌లిసి న‌టించ‌డం ఎంజాయ్ చేశాను. రావుర‌మేశ్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, రోహిణి, ఈశ్వ‌రీగారు స‌హా అంద‌రికీ థ్యాంక్స్‌. నిర్మాత‌లు రాధాకృష్ణ‌గారికి, వంశీకి థ్యాంక్స్‌. జులాయితో ప్రారంభ‌మైన హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ త‌ర్వాత ఎన్నో మంచి చిత్రాలు చేశారు. మ‌ధ్య‌లో వారితో నేను స‌న్నాఫ్ స‌త్యమూర్తి సినిమా చేశాను. వారితో క‌లిసి న‌టిస్తోన్న మూడో సినిమా. చిన‌బాబుగారు మా త‌ప్పుల‌ను భ‌రించారు. ఆయ‌న‌కు మ‌న‌స్ఫూర్తిగా థ్యాంక్స్‌. త్రివిక్ర‌మ్‌గారి గురించి చెప్పాలంటే.. ఇంత మందిని క‌లిపి ఆనందం ఇచ్చేది డైరెక్ట‌రే. మేం టూల్స్ అయితే. వాటిని ఉప‌యోగించుకునే వాడు డైరెక్ట‌ర్ మాత్ర‌మే. అలాంటి త్రివిక్ర‌మ్‌గారితో మూడో సారి క‌లిసి ప‌నిచేశాను. ఆయ‌నంటే అంతిష్టం. నేను ఈరోజు ఇలా ఉన్నానంటే బ‌ల‌మైన కార‌ణం ఆయ‌న‌. నాకు మంచి హిట్ సినిమాలు ఇచ్చారు. నా ప్ర‌తి ఇష్టాన్ని త్రివిక్ర‌మ్‌గారు ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమా ఎంత చేసినా, ఎంత పేరు తెచ్చుకున్నా అది త్రివిక్ర‌మ్‌గారి వ‌ల్లే. ఆయ‌న గురించి ఎంత చెప్పినా త‌క్కువే. నాన్న గురించి నేను, నాగురించి నాన్న ఎప్పుడూ స్టేజ్‌పై చెప్పుకోలేదు. న‌న్ను హీరోగా లాంచ్ చేసింది నాన్నే . స‌భా ముఖంగా ఆయ‌న‌కు ఎప్పుడూ థ్యాంక్స్ చెప్పుకోలేదు. కానీ ఈరోజు ఆయ‌న‌కు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ థ్యాంక్స్ కేవ‌లం నాతో సినిమా చేసినందుకే కాదు.. కొడుకు పుట్టిన త‌ర్వాత నాకు అర్థ‌మైంది ఒక‌టే. నేను మా నాన్నంత గొప్ప‌గా ఎప్పుడూ కాలేను. ఆయ‌న‌లో స‌గం కూడా కాలేను. నాన్న‌లో స‌గం ఎత్తుకు ఎదిగితే చాల‌నే ఫీలింగ్ క‌లుగుతుంది. మా నాన్న‌ను నేను ప్రేమించినంత‌గా మ‌రేవ‌రినీ ప్రేమించ‌ను. నేను ఆర్య సినిమా చేసిన‌ప్పుడు అప్ప‌ట్లోనే కోటి రూపాయ‌లు సంపాదించుకున్నాను. నాకు డ‌బ్బుకు ఎప్పుడూ లోటు లేదు. అప్ప‌టికీ పెళ్లైన త‌ర్వాత నా భార్య‌ను నేను అడిగింది ఒకే ఒక‌టి. నాకెన్ని కోట్లు ఉన్నా.. మా నాన్న ఇంట్లోనే ఉంటాన‌ని. మా నాన్నంటే అంత ఇష్టం.

నేను చాలా మందిని చూసుంటాను. నేను చూసిన వారిలో ది బెస్ట్ ప‌ర్స‌న్ మానాన్నే. పది రూపాయ‌ల వ‌స్తువుని ఏడు రూపాయ‌ల‌కు బేరం చేసిన త‌ర్వాత ఆరు రూపాయ‌లు ఇవ్వండి అన్నా.. వాళ్లింటికి వెళ్లి ఏడు రూపాయ‌లు ఇచ్చేసే వ్య‌క్తి మా నాన్న‌గారు. 45 ఏళ్లుగా ఓ వ్య‌క్తి సినిమాలు, వ్యాపారం చేస్తున్నారు. మ‌నిషిలో ప్యూరిటీ లేక‌పోతే మ‌నిషి ఇవాళ సౌత్ ఇండియాలో, ఇండియాలో నెంబ‌ర్ వ‌న్ ప్రొడ్యూస‌ర్ క్రింద ఉండ‌లేరు.మా తాత‌గారికి ప‌ద్మ‌శ్రీ వ‌చ్చింది. అలాగే మా నాన్న‌గారికి కూడా ప‌ద్మ‌శ్రీ రావాల‌నే కోరిక ఉండేది. కాబ‌ట్టి మా నాన్న‌కు ప‌ద్మ‌శ్రీ అవార్డు ఇవ్వాల‌ని స‌భావేదిక నుండి ప్ర‌భుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆయ‌న అందుకు అర్హుడు. ఇండ‌స్ట్రీకి ఎంతో సేవ చేశారు. ఇంత గ్యాప్ వ‌చ్చిన త‌ర్వాత కూడా నా ఫ్యాన్స్ కార‌ణంగానే నాకు ఈ గ్యాప్ వ‌చ్చిన‌ట్లు అనిపించ‌లేదు. ఎవ‌రికైనా ఫ్యాన్స ఉంటారు. కానీ నాకు మాత్రం ఆర్మీ ఉంది.