విజయ్ దేవరకొండ – నాని మధ్య కెరీర్ తొలి నాళ్లలో మంచి సఖ్యత వుండేది. ఇద్దరు కలిసి `ఎవడే సుబ్రమణ్యం` చిత్రంలో నటించారు. ఇందులో నాని పేరుకే హీరో కానీ సినిమా అంతా విజయ్ దేవరకొండ పోషించిన రిషి పాత్ర చుట్టే తిరుగుతుంది. ఈ సినిమా తరువాతే విజయ్ దేవరకొండ `పెళ్లిచూపులు` సినిమాతో హీరో అయ్యాడు. ఆ మూవీ ట్రైలర్‌ని నానినే రిలీజ్ చేశాడు కూడా. అయితే `అర్జున్‌రెడ్డి` సక్సెస్ తరువాత నుంచి నాని, విజయ్‌ల మధ్య దూరం పెరుగుతూ వచ్చింది.
అదే సమయంలో `ఫలక్‌నుమాదాస్` సినిమాతో తెరపైకొచ్చిన విశ్వక్సేన్ ఈ సినిమా ప్రమోషన్లో విజయ్ దేవరకొండపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. అది కాస్తా వివాదం కావడంతో తను అలా అనలేదని, విజయ్‌ని దూషించలేదని కవర్ చేసే ప్రయత్నం చేశాడు. అలాంటి అతనితో నాని ఇప్పుడు `హిట్` సినిమాని నిర్మించడం, దాన్ని ఇండస్ట్రీలో వున్న వారంతా ప్రశంసిస్తున్నా విజయ్ దేవరకొండ మాత్రం స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
తనంటే పడని వ్యక్తితో నాని సినిమా చేయడం విజయ్‌కి నచ్చలేదని, ఆ కారణంగానే `హిట్` సినిమా విషయంలో స్పందించడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో విజయ్ దేవరకొండ వరుస ఫ్లాపుల్లో వుండటంతో నాని – విజయ్ దేవరకొండల మధ్య చెడిందని, ఆ కారణంగానే తనంటే పడని విశ్వక్సేన్తో సినిమా నిర్మించాడని చెప్పుకుంటున్నారు.