వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తోది సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి. సమంతకు వాయిస్ డబ్బింగ్ చెప్పడంతో లైమ్ లైట్ లోకి వచ్చిన చిన్మయి సోషల్ మీడియా వేదికగా గత కొంత కాలంగా ప్రతి సమస్యపై స్పందిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. భర్త, హీరో, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ సినిమాలు లేక ఖాలీగా వుంటే చిన్మయి మాత్రం వరుస వివాదాలతో సంచలనం సృష్టిస్తోంది. సీనియర్ గేర నచయిత వైరముత్తుని మీటూ లోకి లాగి నానా హంగామా చేసిన చిన్మయి తాజాగా మరో వివాదం సృష్టిస్తోంది.
గతంలో వైరముత్తు, రాధా రవిలపై లైంగిక ఆరోపణలు చేయడంతో ఆమెని టార్గెట్ చేసిన నటుడు రాధారవి డబ్బింగ్ యూనియన్ నుంచి చిన్మయిని నిర్ధాక్షిణ్యంగా తప్పించాడు. దీంతో స్థాయిక సెషన్ కోర్టుని ఆశ్రియించిన ఆమె తన సభ్యత్వం చెల్లుతుందని కోర్టు ఆర్డని తీసుకొచ్చింది. దీని ఆధారం చేసుకుని డబ్బింగ్ యూనియన్ ఎన్నికల్లో ఏకంగా అధ్యక్ష పదవికి రాధా రవికే పోటీకి పోటికి నిలిచింది. ఈ పరిణామాన్ని గమనించిన రాధారవి చకచక పావులు కదిపి అసలు యూనియన్‌లో సభ్యత్వమే లేని చిన్మయికి పోటీ చేసే అర్హత లేదని చెప్పించి ఆమె నామినేషన్ చెల్లది ఎన్నికల అధికారి తిరస్కరించేలా చేశారు.
దీంతో నాటకీయ పరిణామాల మధ్య పోటీ లేకపోవడంతో రాధా రవిని విజేతగా ప్రకటించారు. దీంతో అతను డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్‌కి అధ్యక్షుడిగా గెలుపొందినట్టయింది. ఈ పరిణామాల్ని గమనించిన చిన్మయి సోషల్ మీడియా వేదికగా రాధా రవిపై నిప్పులు చెరిగింది. కోర్టు ఇచ్చిన తీర్పుని కాదని తన మెంబర్ షిప్‌ని రద్దు చేశారని, ఇలా చేయని రాధా రవి ప్రోత్సహించి వుంటే నేను తీసుకోబోయే లీగల్ చర్యలకు సిద్ధంగా వుండాలని రాధా రవిని హెచ్చరించింది.